ఆంధ్రప్రదేశ్ సీఈఓ ముకేశ్ కుమార్ మీనాకు మంత్రుల ఫిర్యాదు.. ఆ తర్వాత కీలక కామెంట్స్
AP Ministers: ఏపీలో పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. పోలీస్ వ్యవస్థ...

Merugu Nagarjuna
ఆంధ్రప్రదేశ్ సీఈఓ ముకేశ్ కుమార్ మీనాను వైసీపీ నేతలు కలిసి పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేశ్, మేరుగ నాగార్జున, పేర్ని నాని, అప్పిరెడ్డి, తదితరులు ముకేశ్ కుమార్ మీనాను కలిసిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఏపీలో పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతోందని అన్నారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ నడుస్తోందని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తున్నారని అన్నారు. అల్లర్లు జరగకుండా చూడాలని ఈసీని కోరామని తెలిపారు.
జోగి రమేశ్ మాట్లాడుతూ.. కేంద్రంతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. కూటమి గెలుస్తుందంటూ వైసీపీ వాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. జూన్ 4న వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని, తామే గెలుస్తామని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, బాలకృష్ణ కూడా ఓడిపోతారని అన్నారు.
Also Read: టీడీపీకి ఈసీ లొంగిపోయింది, అందుకే అక్కడ హింసాత్మక ఘటనలు- పేర్నినాని