శ్రీవారి భక్తురాలిని 6 కి.మీ మోసుకెళ్లిన కానిస్టేబుల్: మానవత్వానికి మతమెందుకు?

శ్రీవారి భక్తురాలిని 6 కి.మీ మోసుకెళ్లిన కానిస్టేబుల్: మానవత్వానికి మతమెందుకు?

Updated On : December 24, 2020 / 4:34 PM IST

AP Tirumala: ఏడు కొండలపై కొలువైన కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఆ స్వామి ఆశీర్వాదాలు ఉండాలి. కానీ పాపం వెంకన్నను దర్శించుకోవటానికి వెళదామని కాలినడకన బయలుదేరిని ఓ భక్తురాలు దారిలోనే అస్వస్థతకు గురైంది. అది గమనించిన షేక్ అర్షద్ ఓ కానిస్టేబుల్ ఆమెను వీపుపై ఎక్కించుకుని 6 కిలోమీటర్ల కొండపైకి ఎక్కాడు.

అనంతరం ఆమెను సకాలంలో హాస్పిటల్ లో చేర్పించి ప్రాణాలు కాపాడాడు. శ్రీవారి భక్తురాలిని కాపాడిన కానిస్టేబుల్ అర్షద్‌ ముస్లిం కావటం గమనించాల్సిన విషయం. శ్రీవారి భక్తురాలిపై పెద్ద మనస్సు చూపించిన అర్షద్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అర్షద్ పెద్ద మనస్సుతో చేసిన ఆ పనికి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కూడా ఫిదా అయ్యారు.

తిరుమల వైకుంఠ ఏకాదశి వేడుకలకు వెళదామనుకున్న మంగి నాగేశ్వరమ్మ అనే 58 ఏళ్ల మహిళ మంగళవారం (డిసెంబర్ 23,2020) శ్రీవారి భక్తురాలు దారిలోనే అస్వస్థతకు గురికావటంతో నడవలేక దారిలోనే కుప్పకూలిపోయింది. ఒక్క అడుగు కూడా వేసే పరిస్థితి లేదు. సమీపంలో ఎటువంటి వైద్యసదుపాయం లేదు. దీంతో ఆమె పరిస్థితి గమనించిన కానిస్టేబుల్ అర్షద్ సహాయం చేయటానికి కుల మతాలతో సంబందం లేదని నిరూపించాడు. ఇది సాయం కాదని.. బాధ్యత అని చెప్పటంతో అర్షద్ పెద్ద మనస్సు ఏంటో అర్థం చేసుకోవచ్చు.

నందలూరు మండలానికి చెందిన మంగి నాగేశ్వరమ్మ కాలినడక మార్గంలో వెళ్తూ హైబీపీతో గుర్రపుపాదం సమీపంలో సొమ్మసిల్లి పడిపోవటంతో అసలే దట్టమైన అటవీ ప్రాంతం. పైగా వాహనాలను వెళ్లలేని దారి కావటంతో ఆమె చాలా సేపు అక్కడే ఉండిపోయింది. ఆమె కూడా మరో ఇద్దరు ఉన్నా ఆమెను మోసుకెళ్లే పరిస్థితిలో లేరు. అదే సమయంలో వారికి ముందుగా వెళుతున్న అర్షద్ సాక్షాత్తు శ్రీనివాసుడే పంపించాడా..అన్నట్లుగా అక్కడికి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ అర్షద్ వచ్చాడు.

ఆమె ఆరోగ్య పరిస్థితిని చూసి చలించిపోయాడు. మరుక్షణం ఆలోచించకుండా ఆమెను వీపులపై ఎక్కించుకొని 6 కి.మీ దూరంలో ఉన్న రోడ్డు మార్గం వరకూ మోసుకెళ్లి, ప్రత్యేక వాహనంలో తిరుమలలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆస్పత్రిలో అడ్మిట్ చికిత్స అందజేశారు.దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పి కోలుకుంటోంది.