Telangana Assembly Election 2023 : తెలంగాణ పోలింగ్ నేపథ్యంలో ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లో నిఘా ముమ్మరం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో పోలీసుల నిఘాను ముమ్మరం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు గురువారం జరగనున్న తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఏపీ పోలీసులు నిఘాను పెంచారు....

Telangana Assembly Election 2023 : తెలంగాణ పోలింగ్ నేపథ్యంలో ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లో నిఘా ముమ్మరం

AP Police

Telangana Assembly Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో పోలీసుల నిఘాను ముమ్మరం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు గురువారం జరగనున్న తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఏపీ పోలీసులు నిఘాను పెంచారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించేందుకు సరిహద్దు జిల్లాల్లో పది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : నేడే పోలింగ్.. సర్వం సిద్ధం చేసిన అధికారులు

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దులో 15 మంది సివిల్ పోలీసులు, ఐదు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, మూడు అటవీశాఖ బృందాలతో పాటు 17 పోలీసు,రవాణ, ఎస్‌ఈబీ, అటవీ, వాణిజ్య పన్నులకు సంబంధించిన అధికారులతో 40 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని డీజీపీ గురువారం చెప్పారు. సరిహద్దు జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రౌడీషీట్‌లు, నేర చరిత్ర ఉన్న 54 మందిని అరెస్టు చేసినట్లు డీజీపీ తెలిపారు.

ALSO READ : Telangana : పోలింగ్‌కు వరుణ గండం..! ఆందోళన నింపిన వాతావరణ కేంద్రం ప్రకటన

తెలంగాణ సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో పోలీసులు 623 కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. 123 వాహనాలతోపాటు 462 కిలోల నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఏడు గంజాయి కేసులతో పాటు 702 అక్రమ డిస్టిల్డ్ లిక్కర్ కేసులు, 1,004 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. ఇంకా లెక్కల్లో చూపని రూ. 7.55 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ : Telangana Polls: ముగ్గురు పోలీసు అధికారులపై EC సస్పెన్షన్ వేటు

208 చీరలు, కారును సీజ్ చేసి ఫ్రీబీస్ కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం విలువ రూ.1.65 కోట్లు అని డీజీపీ తెలిపారు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా సరిహద్దు జిల్లాల్లోని 16 రిటైల్ అవుట్‌లెట్‌లు, ఒక బార్, మద్యం దుకాణాలు, 83 కల్లు దుకాణాలను మూసివేయాలని ఆదేశించినట్లు డీజీపీ వివరించారు.