Telangana Assembly Election 2023: తెలంగాణలో ముగిసిన పోలింగ్.. 70 శాతం ఓటింగ్ నమోదు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది.

Telangana Assembly Election 2023: తెలంగాణలో ముగిసిన పోలింగ్.. 70 శాతం ఓటింగ్ నమోదు

తెలంగాణలో చెదురుమదురు ఘటనలు మినహా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసినప్పటికీ.. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ లలో వేచిఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. 70.66 శాతంకుపైగా పోలింగ్ నమోదైంది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 30 Nov 2023 05:39 PM (IST)

    తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5గంటలకు ముగిసింది. 5గంటల వరకు క్యూ లైన్ లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. సాయంత్రం 5గంటల వరకు 63.94 శాతం పోలింగ్ నమోదు..

    Polling-Percentage

    Polling-Percentage

     

  • 30 Nov 2023 05:01 PM (IST)

    క్యూలైన్ లో ఉన్నవారికే అవకాశం..

    తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కేంద్రంకు చేరుకున్న వారికి మాత్రమే ఓటువేసే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు.

  • 30 Nov 2023 04:12 PM (IST)

    13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం ముగిసింది. వాటిలో..  సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం ప్రాంతాలు ఉన్నాయి. సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ స్టేషన్ లో క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.

  • 30 Nov 2023 04:10 PM (IST)

    తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు ముగిసింది. 4గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి మాత్రమే ఓటింగ్ కు అనుమతిస్తున్నారు.

  • 30 Nov 2023 04:00 PM (IST)

    మధ్యాహ్నం 3గంటల వరకు జిల్లాల వారిగా ఓటింగ్ శాతం వివరాలు .. 

    హైదరాబాద్ లో 31.17శాతం
    సిరిసిల్ల జిల్లాలో 56.66శాతం
    రంగారెడ్డి జిల్లాలో 42.43శాతం
    సంగారెడ్డి జిల్లాలో 56.23 శాతం
    సిద్ధిపేట జిల్లాలో 64.91శాతం
    సూర్యాపేట జిల్లాలో 62.07శాతం
    వికారాబాద్ జిల్లాలో 57.62శాతం
    వనపర్తి జిల్లాలో 60.10శాతం
    వరంగల్ జిల్లాలో 52.28శాతం
    యాదాద్రి జిల్లాలో 64.08శాతం
    హన్మకొండ జిల్లాలో 49శాతం
    మంచిర్యాల జిల్లాలో 59.16శాతం
    అదిలాబాద్ జిల్లాలో 62.34శాతం
    భద్రాద్రి జిల్లాలో 58.38శాతం
    జగిత్యాల జిల్లాలో 58.64శాతం
    జనగామ జిల్లాలో 62.24శాతం
    భూపాలపల్లి జిల్లాలో 64.30శాతం
    గద్వాల జిల్లాలో 64.45శాతం
    కామారెడ్డి జిల్లాలో 59.06శాతం
    కరీంనగర్ జిల్లాలో 56.04శాతం
    ఖమ్మం జిల్లాలో 63.63శాతం
    ఆసిఫాబాద్ జిల్లాలో 59.62శాతం
    మహబూబాబాద్ జిల్లాలో 65.05శాతం
    మహబూబ్ నగర్ జిల్లాలో 58.89శాతం
    మెదక్ జిల్లాలో 69.33శాతం
    మేడ్చల్ జిల్లాలో 38.27శాతం
    ములుగు జిల్లాలో 67.84శాతం
    నాగర్ కర్నూల్ జిల్లాలో 57.52శాతం
    నల్గొండ జిల్లాలో 59.98
    నారాయణ పేట జిల్లాలో 57.17శాతం

  • 30 Nov 2023 03:36 PM (IST)

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఓటువేసేందుకు బారులు తీరుతున్నారు. సాయంత్రం 3గంటల వరకు 51.89శాతం పోలింగ్ నమోదైంది.

  • 30 Nov 2023 03:06 PM (IST)

    కామారెడ్డిలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

    కామారెడ్డి పట్టణంలోని ఇందిరా నగర్ బస్తీలో ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేవంత్ గో బ్యాక్ అంటూ.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోటీగా కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు చేశారు. కాగా ఈ విషయమై 10tvతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఎం చేస్తారో చూద్దామని అన్నారు. బీఆర్ఎస్ బాదెందో తనకు అర్థం కావడం లేదని, తాను ఎన్నికల అధికారులతో మాట్లాడితే.. వీళ్లకు బాధేంటిని ప్రశ్నించారు.

  • 30 Nov 2023 02:56 PM (IST)

    ఆవు మీద వచ్చి ఓటేశాడు

    పెళ్లి పీటల మీద నుంచి, పరీక్ష హాలు నుంచి, ఆసుపత్రి నుంచి.. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇలా రకరకాల ప్రాంతాల నుంచి పోలింగ్ కేంద్రానికి వస్తుంటారు. అయితే ఓ వ్యక్తి పోలింగ్ కేంద్రానికి ఆవు మీద వచ్చాడు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం మహలింగి గ్రామానికి చెందిన వ్యక్తి ఇలా ఆవు మీద వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

  • 30 Nov 2023 02:03 PM (IST)

    పోలింగ్ ప్రక్రియపై ఆరా తీసిన డీజీపీ

    రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియపై డీజీపీ అంజనీ కుమార్ ఆరా తీశారు. జిల్లా ఎస్పీలతో పోలింగ్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమస్యాత్మకమైన ప్రాంతాలపై నిఘా ఉండాలంటూ జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.

  • 30 Nov 2023 01:31 PM (IST)

    ఆదిలాబాద్ జిల్లా మావల పోలింగ్ కేంద్రం వద్ద విషాదం

    ఆదిలాబాద్ జిల్లా మావల పోలింగ్ కేంద్రం వద్ద విషాదం చోటు చేసుకుంది. 140 పోలింగ్ కేంద్రలో ఓటు వేసేందుకు వచ్చిన తోకల గంగమ్మ (80) అనే ఓటరు పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలింది. గంగమ్మను వెంటనే పోలింగ్ కేంద్రం నుంచి రిమ్స్ కు తరలించారు. ఆమె వెంట ఒక పోలింగ్ ఏజెంట్ కూడా వెళ్లారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సమయానికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.

  • 30 Nov 2023 01:30 PM (IST)

    ఓటు వేసిన జూపల్లి రామేశ్వర్ రావు

    మైహోం ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో గురువారం ఆయన ఓటు వేశారు.

     

  • 30 Nov 2023 01:15 PM (IST)

    మేం ఓటేశాం.. మరి మీరు?

    ఓటు హక్కు అనేది సమాజంలోని అంతరాలను చెరిపేసింది. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి ఒక ఓటు.. ఒక ఓటు ఒక విలువ అని రాజ్యాంగాన్ని ప్రవేశ పెట్టే సమయంలో బాబాసాహేబ్ అంబేద్కర్ అన్నారు. ఆ ఓటు హక్కును నేడు తెలంగాణలోని ట్రాన్స్‭జెండర్లు వినియోగించుకున్నారు. అనంతరం వారు పోలింగ్ కేంద్రం వద్ద తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాము ఓటేశామని, మీరు కూడా ఓటేయమంటూ మిగిలిన ఓటర్లను చైతన్యం చేస్తున్నారు.

  • 30 Nov 2023 01:12 PM (IST)

    ఈకో ఫ్రెండ్లీగా పోలింగ్ బూతులు

    జగిత్యాల జిల్లాలో ఈకో ఫ్రెండ్సీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొబ్బరి ఆకులతో ద్వారాలు రూపొందించి పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లకు స్వాగతం పలుకుతున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను ఇది అమితంగా ఆకట్టుకుంటోంది.

  • 30 Nov 2023 01:10 PM (IST)

    ఎమ్మెల్సీ కవిత మీద FIR నమోదు చేసిన ఈసీ

    ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమంటూ పిలుపునిచ్చి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఈ విషయమై ఇంతకు ముందు ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.

  • 30 Nov 2023 12:55 PM (IST)

    గంట ముందే ఎగ్జిట్ పోల్స్.. కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయం

    Election Commission of India changed decision on Exit polls before an hourపోలింగ్ ముగిసిన అరగంట తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇంతకు ముందే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఎన్నికలు పూర్తి కాగా, నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే తొలుత గురువారం సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలని ఎన్నికల సంఘం సూచించినప్పటికీ తాజాగా ఆ సమయాన్ని సవరించింది. సాయంత్రం 5:30 గంటలకే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవ్వొచ్చని తాజాగా ప్రకటించింది.

    వాస్తవానికి పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని అక్టోబర్ 31 న తొలుత ఆదేశించింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలకే ముగుస్తుండడంతో మరో గంట ముందుగానే అంటే సాయంత్రం 5:30 గంటలకే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఈరోజు సాయంత్రం 5:30 తరువాత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.

  • 30 Nov 2023 12:47 PM (IST)

    ఓటు వేసిన మాస్ మహారాజ

  • 30 Nov 2023 12:42 PM (IST)

    BSP కార్యకర్తలపై దాడి చేశారంటూ RSP ఆగ్రహం

  • 30 Nov 2023 12:40 PM (IST)

    రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్: వికాస్ రాజ్

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. EVMల సమస్య వచ్చిన దగ్గర కొత్తవి మార్చామని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలని ఆయన కోరారు. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయని, జరిగిన ప్రతి కంప్లైంట్స్ పై డీఈవోను రిపోర్ట్ అడిగామని తెలిపారు. కవిత, రేవంత్ వ్యాఖ్యల నుంచి కంప్లైంట్స్ వచ్చాయని, డీఈవో రిపోర్ట్ రాగానే కోడ్ ఉల్లంఘిస్తే FIR రిజిష్టర్ చేస్తారని అన్నారు.

  • 30 Nov 2023 12:14 PM (IST)

  • 30 Nov 2023 12:06 PM (IST)

    చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్

    ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన స్వగ్రామమైన చింతమడకలో బూత్ నెంబర్ 13లో ఆయన తన ఓటు వేశారు.

  • 30 Nov 2023 12:03 PM (IST)

    ఉదయం 11 గంటల వరకు పోలింగ్ 20.64 శాతం

    ఉదయం 11 గంటలకు వరకు రాష్ట్రవ్యాప్తంగా 20.64 శాతం పోలింగ్ నమోదు అయిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, మొదటి రెండు గంటలతో పోలిస్తే ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. ఉదయం 9 గంటల వరకు 8.52 శాతం పోలింగ్ మాత్రమే నమోదు అయింది. ఇక తర్వాతి రెండు గంటల్లో 12 శాతం పోలింగ్ నమోదైట్లు తెలుస్తోంది.

  • 30 Nov 2023 11:35 AM (IST)

    ఉమ్మడి మెదక్ జిల్లాలో మద్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ వివరాలు

    సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 22 శాతం పోలింగ్ నమోదు
    మెదక్ జిల్లా వ్యాప్తంగా 30.42 శాతం పోలింగ్ నమోదు
    సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 28.08 పోలింగ్ శాతం నమోదు

  • 30 Nov 2023 11:34 AM (IST)

    వివాదంలోకి జనసేన.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో బాహాబాహీ

    పోలింగ్ ప్రారంభమైన కాసేపటి నుంచే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణలు సాగుతున్నాయి. తాజాగా ఇందులోకి జనసేన కూడా వచ్చి చేరింది. వికారాబాద్ జిల్లా తాండురులో మూడు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మూడు పార్టీల నేతలను పోలీసులు సముదాయించడంతో సద్దుమణిగింది.

  • 30 Nov 2023 11:28 AM (IST)

    ఆక్సీజన్ సిలిండరుతో వచ్చి ఓటేశాడు

    చాలా మంది ఓటింగుకు దూరంగా ఉంటారు. కానీ కొందరి వల్ల ఓటు ఎంత ప్రాధాన్యమైందో తెలియజేస్తారు. గచ్చిబౌలికి చెందన ఒక వ్యక్తి.. లివర్ సిరోసిస్ తో బాధపడుతున్నప్పటికీ ఆక్సీజన్ సిలిండర్ సహాయంతో వచ్చి వేశాడు ఓ వృద్ధుడు. ఈ వయసులో అంతటి కఠిన పరిస్థితిలో ఆయన తన ఓటును వినియోగించుకోవడం పట్ల ప్రశంసలు వస్తున్నాయి.

  • 30 Nov 2023 11:13 AM (IST)

    ఓటేసే దిక్కులేదు

    తమ గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ అసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని వరిపేట గ్రామస్తులు ఓటేసేందుకు నిరాకరించారు. గ్రామంలో పోలింగుకు దూరంగా ఉండిపోయారు. దీంతో ఉదయం 10 గంటల వరకు కేవలం 12 ఓట్లు మాత్రమే పడ్డాయి.

  • 30 Nov 2023 11:09 AM (IST)

    ఓటు వేసిన ట్రాన్స్ జెండర్లు

    నల్లొండ జిల్లా కేంద్రంలో 102 మోడల్ పోలింగ్ స్టేషన్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న 20 మంది ట్రాన్స్ జెండర్లు

  • 30 Nov 2023 11:01 AM (IST)

    నిజామాబాద్‭లో అతి ఎక్కువ, హైదరాబాద్‭లో అతి తక్కువ

    అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 8.52శాతం నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇందులో ఉమ్మడి నిజామాబాద్‭ జిల్లాలో అతి ఎక్కవగా 10.56 శాతం నమోదు కాగా, హైదరాబాద్ జిల్లాలో అతి తక్కువగా 6.73 శాతం నమోదు అయింది.

  • 30 Nov 2023 10:52 AM (IST)

    డబ్బులు ఇవ్వలేదు, ఓటేయము

    వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు వీరాపురం, గొల్లగూడెం గ్రామస్తులు ఓటేయమని మొండికేశారు. ఆయా పార్టీల నేతలు తమకు డబ్బులు ఇవ్వలేదని, తాము ఓటు వెయ్యబోమని గ్రామంలోని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బులిస్తేనే ఓటేస్తామని తెగేసి చెబుతున్నారు.

  • 30 Nov 2023 10:42 AM (IST)

    ఓటు వేసిన అక్కినేని కుటుంబం

    సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబ సమేతంగా ఓటు వేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 45, గవర్నమెంట్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పోలింగ్ నెంబర్ 151 కేంద్రంలో భార్య అమల, కుమారుడు నాగచైతన్యలతో కలిసి ఓటు వేశారు.

  • 30 Nov 2023 10:37 AM (IST)

    హైదరాబాద్-విజయవాడ హైవే జామ్

    అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ రద్దీ ఏర్పడింది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఓటు వేసేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తుండడంతో ఈ రద్దీ ఏర్పడింది.

  • 30 Nov 2023 10:33 AM (IST)

    కుటుంబ సమేతంగా ఓటేసిన మంత్రి హరీష్ రావు

    సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబిటస్ పాఠశాలలో పోలింగ్ కేంద్ర 114వ నంబర్ పోలింగు బూతులో మంత్రి హరీష్ రావు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 30 Nov 2023 10:23 AM (IST)

    జనగామాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ

    జనగామ పట్టణంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు తోసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్కువ సమయం పోలింగ్ కేంద్రం వద్దే ఉంటున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.

  • 30 Nov 2023 10:20 AM (IST)

    ఐదేళ్లకు ఒసారి వచ్చే పండగ: సజ్జనర్

    ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండుగ ఓట్ల పండుగని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. గురువారం ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. యువత ముందుకు వచ్చి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

  • 30 Nov 2023 10:20 AM (IST)

    ఓటు వేసిన బండి సంజయ్

    బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చైతన్యపురి కాలనీలో ఆయన తన ఓటు వేశారు.

  • 30 Nov 2023 10:11 AM (IST)

    ఈవీఎంల మొరాయింపుకు టెక్నికల్ టీమ్

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి నిల్చున్నారు. ఓటింగ్ ప్రక్రియ ఆలస్యం కావటంతో ఎన్నికల కమిషన్ ఈవీఎంల సమస్యలు పరిష్కరించేందుకు టెక్నికల్ టీమ్ ను ఏర్పాటు చేసింది.

  • 30 Nov 2023 10:05 AM (IST)

    హైదరాబాద్ ఈసీ కార్యాలయం నుంచి పోలింగ్‌ను మానిటరింగ్ చేస్తున్న అధికారులు..

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7గంటల నుంచే పోలింగ్ మొదలైంది. ఈక్రమంలో  పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. పోలింగ్ ను ఎన్నికల కమిషన్ పర్యవేక్షిస్తోంది. హైదరాబాద్ ఈసీ కార్యాలయం నుంచి అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. వెబ్ కాస్టింగ్ ను జాయింట్ సీఈఓ సర్పరాజ్ అహ్మద్ పరిశీలిస్తున్నారు.

  • 30 Nov 2023 09:55 AM (IST)

    ఓటు వేసిన బర్రెలక్క

    కొల్లాపూర్ లో ఓటు వేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్క

    Barrelakka vote

    Barrelakka vote

  • 30 Nov 2023 09:45 AM (IST)

    ఓటు వేసిన మంత్రి కేటీఆర్

    మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 30 Nov 2023 09:43 AM (IST)

    ఓటు వేసిన బీఎస్పీ చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

  • 30 Nov 2023 09:30 AM (IST)

    రాహుల్ ట్వీట్...

    ‘‘నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు. నా తెలంగాణ సోదరసోదరీమణులారా! రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయండి’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

  • 30 Nov 2023 09:29 AM (IST)

    ప్రియాంక గాంధీ ట్వీట్..

    ‘‘నా తెలంగాణ సోదర సోదరీమణులారా.. మా తల్లులారా.. పిల్లలారా. మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు వేయడం మీ హక్కు. అది మీ అతిపెద్ద బాధ్యత. ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండి. అభినందనలు. జై తెలంగాణ. జై హింద్’’ అంటూ ట్వీట్ చేశారు.

  • 30 Nov 2023 09:29 AM (IST)

    ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

    బెల్లంపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య కోడ్ ఉల్లంఘించారు. బీఆర్ఎస్ కండువాతో వెళ్లి చిన్నయ్య ఓటు వేశారు. నెన్నెల మండలం జెండా వెంకటాపూర్ 219 పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును చిన్నయ్య కుటుంబ సభ్యులు వినియోగించుకున్నారు.

  • 30 Nov 2023 09:22 AM (IST)

    ఓటు వేయని వారు దేశద్రోహులు.. డైరెక్టర్ తేజ

  • 30 Nov 2023 09:20 AM (IST)

    పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ బాహాబాహీ

    ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఖానాపూర్ లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 105వ నంబర్ పోలింగ్ కేంద్రం వద్దే ఇరు పార్టీల కార్యకర్తలు గొడవకు దిగారు. పోలీసుల జోక్యం చేసుకుని ఇరు పార్టీల కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడంతో కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  • 30 Nov 2023 09:16 AM (IST)

    ఉదయం 9 గంటలకు సుమారు 14 శాతం పోలింగ్ నమోదు

  • 30 Nov 2023 09:16 AM (IST)

    హైదరాబాద్ జిల్లా పరిధిలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతం

    హైదరాబాద్ జిల్లా పరిధిలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ అన్నారు. నాలుగు ఐదు పోలింగ్ కేంద్రాలు మినహాయించి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పని చేస్తున్నాయని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో సజావుగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఓటింగ్ శాతాన్ని పెంచేలా హైదరాబాద్ జిల్లా ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

  • 30 Nov 2023 09:11 AM (IST)

    తెలంగాణ అంశాన్ని సెంటిమెంటుగా వాడుకుంటున్నారు: రేవంత్ రెడ్డి

    తెలంగాణ అంశాన్ని సెంటిమెంటుగా వాడుకుని రాజకీయ ప్రయోజనం పొందేందుకు బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకుంటోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులకు మధ్య చెలరేగిన గొడవపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సాగర్ డ్యాం ఎక్కడికీ పోదని, నీళ్లు కూడా అక్కడే ఉంటాయని.. కొద్ది రోజుల్లో ఈ సమస్యకు కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చూపుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.

  • 30 Nov 2023 09:04 AM (IST)

    ఖమ్మం జిల్లాలో ఉదయం 9 గంటలకు 11 శాతం పోలింగ్ నమోదు అయింది.

  • 30 Nov 2023 09:00 AM (IST)

    మరోసారి హెచ్చరించిన ఎన్నికల ముఖ్య అధికారి

    తెలంగాణలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని, అయితే నేతలెవరూ ఎన్నికల నియామవళిని అతిక్రమించొద్దని రాష్ట్ర ఎన్నికల ముఖ్యఅధికారి వికాస్ రాజ్ హెచ్చరించారు. ఇప్పటికే మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. మంత్రి బీఆర్ఎస్ కండువా వేసుకుని పోలింగ్ బూతుకు వచ్చారు, ఇక కవిత పోలింగ్ స్టేషన్ వద్దే బీఆర్ఎస్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు.

  • 30 Nov 2023 08:58 AM (IST)

    పోలింగ్ బహిష్కరించిన ఓటర్లు

    ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని సత్యంపేట గ్రామస్థులు పోలింగును బహిష్కరించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టని కారణంగా ఓటేయమని వారు తేల్చి చెప్పారు. కాగా, ఓటేయమని అధికారులు బతిమాలడంతో వెనక్కి తగ్గి ఓటేసేందుకు ముందుకు వచ్చారు.

  • 30 Nov 2023 08:56 AM (IST)

    ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్సీ కవిత

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. ఎన్నికల్లో భాగంగా గురువారం బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌ పోలింగ్ స్టేషన్‌లో కవిత తన ఓటును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ సమయంలో ఇలా ఒక పార్టీకి ఓటు వేయాలని చెప్పడం ఎన్నికల నియమావళికి విరుద్ధం. కాగా, కవిత వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

  • 30 Nov 2023 08:54 AM (IST)

    రామగుండంలో ఇంకా ప్రారంభంకాని పోలింగ్

    పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఉన్న 87వ పోలింగ్ బూతులో పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రారంభించలేకపోయినట్లు పోలింగ్ సిబ్బంది పేర్కొంది. కాగా, ఇప్పటికే అనేకమంది ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు. పోలింగ్ ఆలస్యం అవ్వడం పట్ల ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • 30 Nov 2023 08:46 AM (IST)

    ఓటు వేసిన సింగిరెడ్డి, రఘునందన్ రావు

    వనపర్తిలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దంపతులు,దుబ్బాకలో బీజేపీ నేత రఘునందన్ రావు ఓటు హక్కు వినయోగించుకున్నారు.

  • 30 Nov 2023 08:45 AM (IST)

    ఓటు వేసిన బాల్క సుమన్

    మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లిలో ఓటు వేసిన బీఆర్ఎస్ అభ్యర్ధి బాల్క సుమన్..

  • 30 Nov 2023 08:32 AM (IST)

    ఓటుహక్కు వినియోగించుకున్న రాజకీయ నేతలు

    రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. దీంట్లో భాగంగా..ఖమ్మం జిల్లా నారాయణపురంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓటు వేశారు. పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్ధి చల్లా ధర్మారెడ్డి,నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో ఇంద్రకరణ్ రెడ్డి,ఖమ్మం గొల్లగూడెంలో తుమ్మల నాగేశ్వరరావు వంటి పలువురు రాజకీయ నేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 30 Nov 2023 08:25 AM (IST)

    పోలింగ్ బూత్ వద్ద ఓటర్ల ఆందోళన

    సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ఉన్న మంగళ్ పేట 179వ బూత్ వద్ద ఓటర్లు ఆందోళన చేపట్టారు. పోలింగ్ బూతులో వెలుతురు లేకపోవడంతో ఈవీఎం మీద గుర్తులు కనిపించడం లేదేని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

  • 30 Nov 2023 08:25 AM (IST)

    ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

    మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. పోలింగ్ కేంద్రానికి ఆయన బీఆర్ఎస్ కండువా వేసుకుని వచ్చారు. దీనిపై పోలింగ్ కేంద్రంలోనే కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, బయటి నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

  • 30 Nov 2023 08:11 AM (IST)

    అంతర్గత యుద్ధం ఓటుతోనే చేయాలి: కవిత

     

  • 30 Nov 2023 08:03 AM (IST)

    ఓటు వేసిన ఎన్నికల ముఖ్య అధికారి

    తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారిక వికాస్ రాజ్ ఓటు వేశారు. హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ పోలింగ్ బూతులో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 30 Nov 2023 07:53 AM (IST)

    ఎన్నికలు ప్రశాంతం.. డీజీపీ అంజనీ కుమార్

    తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 70 వేల మంది పోలీస్ సిబ్బంది (ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి హోంగార్డ్ సిబ్బంది, కేంద్ర బలగాలతో కలిపి) భారీ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

  • 30 Nov 2023 07:43 AM (IST)

    బంజారాహిల్స్ లో ఓటు వేసిన ఎంఎల్సీ కవిత

     

  • 30 Nov 2023 07:42 AM (IST)

    బర్కత్‭పురలో ఓటు వేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • 30 Nov 2023 07:32 AM (IST)

    క్యూలో నిలబడి ఓటు వేసిన జూనియర్ ఎన్టీఆర్

  • 30 Nov 2023 07:30 AM (IST)

    రాష్ట్రంలో చాలాచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు

    రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ సెంటర్ మార్క్ స్కూల్ వద్ద ఈవీఎంలు పని చేయలేదు. దీంతో అక్కడ ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. కరీంనగర్ లోని 371 పొలీంగ్ స్టేషనులో కూడా ఇదే పరిస్థితి. పోలింగ్ స్టేషన్ ముందు ఓటర్లు బారులు తీరారు. సంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.

  • 30 Nov 2023 07:26 AM (IST)

    ఓటు వేసిన అల్లు అర్జున్

    సినీ నటుడు అల్లు అర్జున్ ఓటు వేశారు.

  • 30 Nov 2023 07:22 AM (IST)

    రికార్డు స్థాయిలో ఓటేయండి.. తెలంగాణ ఓటర్లకు ప్రధాని విజ్ఞప్తి

    అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రికార్డు స్థాయిలో ఓటు వేయాలని ఓటర్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు.

  • 30 Nov 2023 07:05 AM (IST)

    ఓటింగ్ సమయం.. బయటికి రండంటూ ఎన్నికల సంఘం పిలుపు

    తెలంగాణ ఓటర్లకు ఇది పోలింగ్ సమయమని, అందరూ బయటికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది.

  • 30 Nov 2023 07:02 AM (IST)

    ఆదర్శ మహిళా కేంద్రంలో మొరాయించిన ఈవీఎం

    కొమురం భీం జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ లోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఆదర్శ మహిళా పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. పోలింగ్ ప్రారంభం కాకముందే ఈవీఎం సరిగా పని చేలయేదు.

  • 30 Nov 2023 06:58 AM (IST)

    అందరూ ఓటు వేయాలని గవర్నర్ తమిళిసై విజ్ఞప్తి

    అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అందరూ ఓటు వేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో కల్పించిన అత్యంత గౌరవమైన హక్కు ఓటు అని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

  • 30 Nov 2023 06:45 AM (IST)

    ఉమ్మడి నిజామాబాద్ లో ముగిసిన మాక్ పోలింగ్

    రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయమే ప్రారంభమైన మాక్ పోలింగ్ ముగిసింది. ఇక సరిగ్గా 7గంటలకు అసలు పోలింగ్ ప్రారంభం కానుంది.

  • 30 Nov 2023 06:43 AM (IST)

    ఉమ్మడి నల్గొండలో ముగిసిన మాక్ పోలింగ్

    రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా గురువారం ఉదయమే ప్రారంభమైన మాక్ పోలింగ్ ముగిసింది. 90 నిమిషాల ముందే మాక్ పోలింగును అధికారులు నిర్వహించారు.

  • 30 Nov 2023 06:39 AM (IST)

    సాగర్ గొడవపై స్పందించిన కోమటిరెడ్డి

    నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తతపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని, తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసేందుకు రాత్రికి రాత్రే నీటి కోసం గొడవ సృష్టించారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

  • 30 Nov 2023 06:12 AM (IST)

    మాక్ పోలింగ్ ప్రారంభం

    అన్ని పోలింగ్ కేంద్రాల్లో తెల్లవారుజామున 5.30 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ ఎన్నికల మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమవుతుంది.

  • 30 Nov 2023 06:11 AM (IST)

    పోలింగ్ కు పటిష్ట భద్రత

    పోలింగ్ వేళ పోలీసు నిఘాను మరింత పటిష్టం చేశారు. ఇప్పటికే సుమారు లక్షమందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు 144 సెక్షన్ కొనసాగనుంది. ఎన్నికల ప్రక్రియను కంట్రోల్ రూమ్ ద్వారా ఈసీ పర్యవేక్షించనుంది. ఈసారి పోలింగ్ శాతం పెంచేలా ఈసీ అన్ని చర్యలు తీసుకుంది. ఓటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఓటు వజ్రాయుధం అని, ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని పిలుపునిచ్చింది.