Telangana : పోలింగ్‌కు వరుణ గండం..! ఆందోళన నింపిన వాతావరణ కేంద్రం ప్రకటన

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. ఈ వాయుగుండం బంగాళాఖాతంలో వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందంది.

Telangana : పోలింగ్‌కు వరుణ గండం..! ఆందోళన నింపిన వాతావరణ కేంద్రం ప్రకటన

Telangana Rains (Photo : Google)

తెలంగాణకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. తెలంగాణలో రెండు రోజుల (రేపు, ఎల్లుండి) పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. ఈ వాయుగుండం బంగాళాఖాతంలో వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందంది.

దీంతో తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని అంచనా వేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలకు తేలికపాటి వర్ష సూచన చేసింది. దక్షిణ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది.

Also Read : పోలింగ్‌పై ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా నగర ఓటర్ల ఉదాశీనత.. అత్యల్ప ఓటింగ్

సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డే రోజున వానలు కురిసే అవకాశం ఉండటం కొంత ఆందోళనకు గురి చేస్తోంది. భారీ వర్షాలు కురిస్తే ఎన్నికల పోలింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వర్రీ అవుతున్నారు. వర్షం నడుమ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్తారా అనే ఉత్కంఠ నెలకొంది.

Also Read : సొంతూళ్లకు హైదరాబాద్ వాసులు.. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్‌లు

కాగా.. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 5గంటలకు ముగుస్తుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ ముగుస్తుంది. 119 నియోజకవర్గాలకు ఒకే దేశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 13 నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు.