AP Police Recruitment 2022: ఏపీలో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల

AP Police Recruitment 2022: ఏపీలో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల

Updated On : November 28, 2022 / 4:23 PM IST

AP Police Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో 411 ఎస్సై, 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కోసం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. 315 ఎస్సై, 96 రిజర్వ్‌ ఎస్సై, 3,580 సివిల్‌ కానిస్టేబుల్, ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏడాది జనవరి 22న ప్రిలిమనరీ రాత పరీక్ష ఉంటుంది. అలాగే, ఎస్సై పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎస్ఐ పోస్టులకు వచ్చేనెల 14 నుంచి జనవరి 18 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి.

Kim’s Daughter: మరోసారి తన కూతురితో కలిసి సైనికుల వద్దకు కిమ్.. ఏం సందేశం ఇస్తున్నారు?

అలాగే, కానిస్టేబుల్ పోస్టుల కోసం ఈ నెల 30 నుంచి వచ్చే నెల 28 వరకు దరఖాస్తులు చేసుకోచ్చు. పూర్తి వివరాలకు slprb.ap.gov.in వెబ్ సైట్ చూడొచ్చు. దరఖాస్తులు కూడా ఈ వెబ్ సైట్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది.

పూర్తి వివరాలు…

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..