Ravela Kishore Babu : గులాబీ గూటికి ఏపీ నేతలు.. బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్న రావెల, తోట
ఏపీకి చెందిన నేతలు రేపు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో చేరనున్నారు. మాజీమంత్రి రావెల కిషోర్ బాబుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ లు రేపు సాయంత్రం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. వీరితో పాటు మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారధి కూడా బీఆర్ఎస్ లో చేరే ఛాన్స్ ఉంది.(Ravela Kishore Babu)

Ravela Kishore Babu : ఏపీకి చెందిన నేతలు రేపు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో చేరనున్నారు. మాజీమంత్రి రావెల కిషోర్ బాబుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ లు రేపు సాయంత్రం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. వీరితో పాటు మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారధి కూడా బీఆర్ఎస్ లో చేరే ఛాన్స్ ఉంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
బీఆర్ఎస్ లోకి ఏపీ నుంచి వలసలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మాజీమంత్రి రావెల కిషోర్ బాబు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తోట చంద్రశేఖర్, చింతల పార్థసారధిలు బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. వీరి చేరికలకు సంబంధించి తెలంగాణ భవన్ లో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రాజకీయ అనుభవం ఉన్న నాయకులు గులాబీ పార్టీలో చేరనుండటం.. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.(Ravela Kishore Babu)
రాబోయే రోజుల్లో ఏపీ నుంచి బీఆర్ఎస్ లో చేరేందుకు మరికొందరు నేతలు సిద్ధంగా ఉన్నారనే టాక్ ఉంది. రేపు మాత్రం మాజీమంత్రి రావెల, 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారధిలు గులాబీ గూటికి చేరుకోనున్నారు.
బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా ఏపీ నుంచి ఆసక్తి చూపిస్తున్న నేతలందరిని పార్టీలో చేర్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ముగ్గురిని రేపు బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి ముహుర్తం ఫిక్స్ చేశారు కేసీఆర్. త్వరలోనే మరికొందరు నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కిసాన్ సెల్ ను ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నారు. ఇదే క్రమంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ అధ్యక్షుల నియామకం పనిలో కూడా కేసీఆర్ నిమగ్నమై ఉన్నారు.