AP Covid Updates : ఏపీలో కరోనా కల్లోలం.. మరోసారి 3వేలకు పైగా కొత్త కేసులు.. ఆ జిల్లాలో ఉగ్రరూపం

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి 3వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 33వేల 755 శాంపుల్స్ పరీక్షించగా

AP Covid Updates : ఏపీలో కరోనా కల్లోలం.. మరోసారి 3వేలకు పైగా కొత్త కేసులు.. ఆ జిల్లాలో ఉగ్రరూపం

Andhra Pradesh Corona

Updated On : April 12, 2021 / 7:51 PM IST

AP Covid Updates : ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి 3వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 33వేల 755 శాంపుల్స్ పరీక్షించగా 3వేల 263 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,28,664కి చేరింది. వీరిలో 8,98,238 మంది కోలుకున్నారు.

24 గంటల వ్యవధిలో కొవిడ్‌ కారణంగా మరో 11 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు.. అనంతపురం, కడప, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7వేల 311కి చేరింది. ఒక్కరోజులో 1,091 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 23,115 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,54,63,146 నమూనాలను పరీక్షించారు.

రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 654 కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా అక్కడే ఎక్కువగా ఉన్నాయి. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 19 కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం(ఏప్రిల్ 12,2021) బులెటిన్‌ విడుదల చేసింది.