స్కూళ్లలో టాయిలెట్స్ పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్ : CM జగన్

స్కూళ్లలో టాయిలెట్స్ పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్ : CM జగన్

Updated On : January 18, 2021 / 2:21 PM IST

AP : Special mobile app for monitoring toilets in schools  : స్కూళ్లలో టాయిలెట్ల పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్‌పై CM జగన్ సమీక్ష చేపట్టారు. విద్యాశాఖ అధికారులతో సోమవారం (జనవరి 18) సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా సీఎం జగన్ స్కూల్స్ లో టాయిలెట్స్ నిర్వహణ, విద్యార్ధుల హాజరు శాతం ఎలా ఉంది అనే అంశాలపై విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..స్కూల్స్ లో టాయిలెట్ల నిర్వహణ అనేది ముఖ్యమైన విషచం..టాయిలెట్లు లేకపోవటం, ఉన్నవాటిని సక్రమంగా నిర్వహించకపోవటం వల్ల.. చాలావరకు పిల్లలు స్కూళ్లకు రాలేని పరిస్థితి నెలకొందని అన్నారు.

పరిశుభ్రమైన టాయిలెట్లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. ఎప్పుడు మరమ్మతు వచ్చినా వెంటనే బాగుచేసేలా చర్యలుండాలని అధికారులకు సూచించారు. టాయిలెట్ల క్లీనింగ్‌పై కేర్‌టేకర్లకు అవగాహన కల్పించాలనీ అన్నారు. విద్యాసంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. నాడు-నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇంగ్లీష్‌ మీడియం ద్వారా అందుబాటులోకి నాణ్యమైన విద్య. విద్యార్థులకు పోషకాహారం కోసం గోరుముద్ద అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, స్కూల్స్ విద్యాశాఖ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ కార్యదర్శి వై శ్రీలక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వి చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.