AP SSC Hall Tickets : విద్యార్థులకు గుడ్ న్యూస్.. వాట్సప్‌లో ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..
AP SSC Hall Tickets : ఏపీ టెన్త్ విద్యార్థులు హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. వాట్సాప్‌లో నేరుగా హాల్ టికెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకోండి.

AP SSC Hall Ticket 2025
AP SSC Hall Tickets : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. ఈ నెల 17 నుంచి రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పరీక్షలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించి టెన్త్ హాల్ టికెట్లు విడుదల చేసింది రాష్ట్ర విద్యాశాఖ. అయితే, టెన్త్ విద్యార్థులు తమ హాల్‌టికెట్లను నేరుగా వాట్సప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అంతేకాదు.. టెన్త్ హాల్ టికెట్లను విద్యార్థులు (మనమిత్ర వాట్సప్ 9552300009)తో పాటు అధికారిక వెబ్‌సైట్ (https://www.bse.ap.gov.in) ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో పరీక్షకు సంబంధించి జిల్లా పేరు, విద్యార్థి పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను అందించాలి. తద్వారా టెన్త్ ఎగ్జామ్ హాల్‌టికెట్లను ఈజీగా డౌన్‌లోడ్ చేయొచ్చు. ఏపీలో దాదాపు 6 లక్షల మందికి పైగా టెన్త్ విద్యార్థులు ఉన్నారు. వీరంతా పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు.
Read Also : Vastu Tips : విద్యార్థులు ఈ దిశలో కూర్చొని అసలు చదవద్దు.. ఎక్కడ కూర్చొని చదివితే పరీక్షల్లో విజయం మీదే..!
వాట్సప్‌లో హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేయాలంటే :
- ముందు మీ స్మార్ట్‌ఫోన్‌లో (95523 00009) నంబర్ సేవ్ చేయండి.
- ఆ తర్వాత ‘Hi’ అని మెసేజ్ పంపండి.
- మీకు సర్వీస్ సెలక్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- ఆపై ‘Education Services’ ఆప్షన్ ఎంచుకోండి.
- ‘SSC Hall Ticket’ ఆప్షన్ సెలక్ట్ చేయండి.
- అప్లికేషన్ నంబర్/స్టూడెంట్ ఐడీ, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
- రెగ్యులర్/ప్రైవేటు/OSSC రెగ్యులర్/ఓకేషనల్‌లలో కేటగిరీని సెలెక్ట్ చేసి కన్‌ఫర్మ్ చేయండి.
- కొన్ని క్షణాల్లోనే టెన్త్ హాల్‌టికెట్ మీ వాట్సప్ నంబర్‌కి వస్తుంది.
- హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.