Vastu Tips : విద్యార్థులు ఈ దిశలో కూర్చొని అసలు చదవద్దు.. ఇలా కూర్చొని చదివితే పరీక్షల్లో విజయం మీదే..!
Vastu Tips : అసలే పరీక్షల సమయం.. విద్యార్థులంతా పరీక్షల కోసం తెగ ప్రిపేర్ అవుతుంటారు. వాస్తు ప్రకారం.. ఏయే దిశలో కూర్చొని చదివితే అద్భుతమైన విజయాలను సాధిస్తారో ఇప్పుడు చూద్దాం..

Vastu tips for students
Vastu Tips : ప్రతి ఒక్కరూ చదువులో ముందుండాలని కోరుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. సరైన దిశలో కూర్చుని చదువుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని తెలుసా? విద్యార్థులకు మెరుగైన ఫలితాలను కూడా ఇస్తుంది. ప్రస్తుతం బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి.
విద్యార్థులందరూ చదువులో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో మనం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన వాస్తు టిప్స్ గురించి తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం మన జీవితంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది.
Read Also : Oneplus Sale : వన్‌ప్లస్ హోలీ స్పెషల్ సేల్.. ఈ 5 వాటర్‌ప్రూఫ్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!
వాస్తు దిశలో ఏదైనా తప్పుగా ఉంటే అది మన దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అవును.. మీరు సరిగ్గా చదివారు. విద్యార్థులు తమ చదువులో రాణించాలంటే తప్పనిసరిగా వాస్తుపరంగా కొన్ని నియమాలు ఉన్నాయి.
వాస్తు నిర్దేశించిన దిశలోనే కూర్చొని చదివితే ఊహించిన ఫలితాలను పొందవచ్చునని అంటున్నారు వాస్తు నిపుణులు. కొంతమంది వాస్తుదోషం కారణంగా చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత కూడా లక్ష్యాన్ని సాధించలేరు.
నిజానికి, వాస్తు శాస్త్రంలో దిశ చాలా ముఖ్యమైనది. తప్పుడు దిశలో కూర్చొని ఏదైనా పని చేస్తే ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అంటారు. వాస్తు లోపమే దీనికి కారణం కావచ్చు. అందుకే, విద్యార్థులు ఏ దిశలో కూర్చుని చదువుకోవాలి, ఏ దిశలో చదువుకోకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఏ దిశలో కూర్చొని చదువుకోవాలి? :
తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ దిశలో కూర్చుని చదువుకోవాలో అవగాహన ఉండదు. తూర్పు దిశ విద్యార్థులకు చాలా మంచిది. తూర్పు సూర్యుడు ఉదయించే దిశగా వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాంటి పరిస్థితిలో ఈ దిశలో కూర్చుని చదువుకోవడం చాలా మంచిది. పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.
ఈ దిశ కూడా మంచిదే :
వాస్తునిపుణుల ప్రకారం.. ఉత్తర దిశ కూడా విద్యార్థులకు చదువుకునేందుకు చాలా మంచిది. మీ చదువులో దృష్టి పెట్టాలనుకుంటే లేదా మీ తరగతిలో ఫస్ట్ ర్యాంకులో రావాలనుకుంటే మీకు అనుకూలమైన దిశలో కూర్చుని చదువుకోవాలి. వాస్తు మన జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ దిశలో కూర్చొని చదవొద్దు :
విద్యార్థులు పొరపాటున కూడా దక్షిణ దిశలో కూర్చుని చదువుకోకూడదట. దక్షిణం వైపు తిరిగి చదువుకోకూడదని అంటారు. మీ జాతకంలో దక్షిణ దిశ మీకు అనుకూలంగా ఉంటే మీరు ఈ దిశలో కూర్చొని చదవుకోవచ్చు.