Bjp Mp Candidates List : ఏపీ, తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే

ఏపీ నుంచి 10 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపై రేపు ప్రకటన చేసే అవకాశం ఉంది.

Bjp Mp Candidates List : ఏపీ, తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే

Bjp Mp Candidates List : లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ హైకమాండ్ ఏపీ, తెలంగాణ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఏపీలో 6 స్థానాలకు, తెలంగాణలో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక, ఏపీ నుంచి 10 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపై రేపు ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి పార్లమెంట్‌ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

మొత్తం 6 స్థానాలకు అభ్యర్థులు ఖరారు

ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు

రాజమండ్రి – పురంధేశ్వరి

రాజంపేట – నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

అరకు – కొత్తపల్లి గీత

తిరుపతి – వరప్రసాద్

నర్సాపూర్ – శ్రీనివాసవర్మ

అనకాపల్లి – సీఎం రమేశ్‌

తెలంగాణ నుంచి 2 పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బిజెపి

వరంగల్ – ఆరూరి రమేష్

ఖమ్మం – తాండ్ర వినోద్ రావు

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి 5వ జాబితా విడుదల చేసింది బీజేపీ. 111 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కూడా ఉన్నారు. తెలంగాణలో రెండు స్థానాలకు (వరంగల్-ఆరూరి రమేష్, ఖమ్మం-తాండ్ర వినోద్ రావు).. ఆంధ్రప్రదేశ్ లో 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.

రాజంపేట నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి, అరకు కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి నుంచి వరప్రసాద్ లు బరిలోకి దిగనున్నారు.

5వ జాబితాలో ఏపీ, తెలంగాణ, బీహార్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ , జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మిజోరాం, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుండి అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. ఇప్పటివరకు లోక్ సభ ఎన్నికలకు 402 మంది అభ్యర్థులని ప్రకటించినట్లు అయ్యింది. ఇప్పటివరకు తొలి జాబితాలో 195 మంది అభ్యర్థులు, రెండో జాబితాలో 72 మంది, మూడో జాబితాలో 9 మంది, నాలుగో జాబితాలో 15 మంది, ఐదో జాబితాలో 111 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది బీజేపీ. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Also Read : ఆ 6 సీట్లను చంద్రబాబు ఎందుకు పెండింగ్‌లో పెట్టారు? ఎందుకింత తర్జనభర్జన?