Sailajanath On Results : బీజేపీ గెలుపు శాశ్వతం కాదు, త్వరలో పుంజుకుంటాం- శైలజానాథ్

బీజేపీ గెలుపు శాశ్వతం కాదని త్వరలో పుంజుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై పునరాలోచించుకుంటామని, లోపాలను..(Sailajanath On Results)

Sailajanath On Results : బీజేపీ గెలుపు శాశ్వతం కాదు, త్వరలో పుంజుకుంటాం- శైలజానాథ్

Sailajanath On Results

Updated On : March 10, 2022 / 8:20 PM IST

Sailajanath On Results : యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూసిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాలు బీజేపీలో నూతనోత్సాహం నింపాయి. ఐదింటిలో మూడు చోట్ల (యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్) స్పష్టమైన మెజార్టీ సాధించింది బీజేపీ. గోవాలో మేజిక్ ఫిగర్ కి కేవలం అడుగు దూరంలో నిలిచిపోయింది. ఈ ఫలితాలతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు బిగ్ షాక్ ఇచ్చాయి. కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. వరుసగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోతోంది. తాజాగా పంజాబ్ లోనూ అధికారాన్ని చేజార్చుకుంది. గతంలో 13 రాష్ట్రాల్లో పవర్ లో ఉన్న హస్తం పార్టీ.. ఇప్పుడు రెండు రాష్ట్రాలకే(రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్) పరిమితమైంది.

AAP Punjab : పంజాబ్‌లో కొత్త చరిత్ర సృష్టించిన ఆప్‌.. జాతీయ పార్టీలను ఊడ్చి పారేసిన ‘చీపురు’

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ స్పందించారు. ఐదు రాష్ట్ర్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న విజయం సాధించలేకపోయిందన్నారు. ఆర్ఎస్ఎస్ సామాజిక, ఆర్ధిక భావజాలంను 80 సంవత్సరాలు కాంగ్రెస్ ఆపిందన్నారు. బీజేపీ గెలుపు శాశ్వతం కాదన్న ఆయన మేము కూడా త్వరలో పుంజుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలపై పునరాలోచించుకుంటామని, లోపాలను సరిదిద్దుకుంటామని శైలజానాథ్ తెలిపారు. దేశాన్ని కాపాడుకోవడాని రాహుల్ గాంధీ నేతృత్వంలో ముందుకు వెళతామన్నారు.(Sailajanath On Results)

UP Congress : ప్చ్ ప్రియాంక..! కాంగ్రెస్ ఓటమికి కారణాలివే..!

ప్రస్తుతం దేశంలో ముగ్గురు నలుగురు 12 లక్షల కోట్లకు అధిపతులు అయ్యారని, దానికి కారణం ఏంటనేది యువత ఆలోచించాలని శైలజానాథ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారని, స్థలం రేటుకే ప్లాంట్ ఇచ్చేస్తున్నారని శైలజానాథ్ మండిపడ్డారు. రామతీర్ధంలో హడావుడి చేసిన బీజేపీ నాయకులు.. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై హడావుడి ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. ఓడరేవులు, ఎల్ఐసీ, ఓఎన్జీసీ అమ్మేస్తాం అంటే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదన్నారు. చైనా ఆక్రమించిన భూమిపై నరేంద్ర మోదీ ఎందుకు మాట్లాడరని శైలజానాథ్ ప్రశ్నించారు. ఇరాక్ – కువైట్ యుద్ధం సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్షకుపైగా శరణార్దులను తరలించామని గుర్తు చేశారు.

Uttar Pradesh 2022 : యూపీ నా అడ్డా అంటున్న యోగీ.. మెజార్టీకి 15 పాయింట్స్

శతాబ్ద కాలానికి పైగా ఘన చరిత్ర కలిగి, గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పిలవబడే కాంగ్రెస్.. రోజురోజుకూ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. దేశంలో ఏ ప్రాంతంలో, ఏ ఎన్నికలు జరిగినా ఓటమిపాలు కావడం కామన్ గా మారింది. రీసెంట్ గా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో.. ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలో రాలేదు.

Uttarpradesh : యోగి 7 రికార్డులు..పూర్తి వివరాలు

2012లో దేశంలో 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం కానుంది. రాజస్తాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉండనుంది. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట.

AAP in Punjab: పంజాబ్ ను కైవసం చేసుకున్న “ఆమ్ ఆద్మీ”: సక్సెస్ సీక్రెట్