మంత్రి కొడాలి నాని హౌస్‌ మోషన్ పిటిషన్‌పై వాదనలు పూర్తి

మంత్రి కొడాలి నాని హౌస్‌ మోషన్ పిటిషన్‌పై వాదనలు పూర్తి

Updated On : February 17, 2021 / 9:46 PM IST

Minister Kodali Nani House Motion Petition : ఏపీ మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన హౌస్‌ మోషన్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. తనను మీడియాతో మాట్లాడొద్దంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి కొడాలి నాని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇరుపక్షాలు మూడు దఫాలుగా వాదనలు వినిపించాయి. కొడాలి నాని వ్యాఖ్యలు ద్వేషపూరితంగా లేవని ఏజీ శ్రీరాం వాదించారు. ఇరుపార్టీలను సమాన దృష్టితో చూడాలని అమికస్ క్యూరీ శ్రీరఘురాం కోర్టుకు సూచించారు. వాదనలు ముగిసిన అనంతరం తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు వెల్లడించింది.