Vijayasai Reddy : అశోక్ గజపతి రాజూ..రెచ్చిపోవద్దు..ఎప్పటికైనా జైలుకెళ్లాల్సిందే

మాన్సాన్ ట్రస్టుకు చైర్మన్ గా అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. అశోక్ గజపతిరాజు కేవలం ఛైర్మన్ మాత్రమేననీ..కానీ ఆయన ఎప్పటికైనా సరే జైలుకు వెళ్లాల్సిందేనంటూ ఫైర్ అయ్యారు.

Vijayasai Reddy : అశోక్ గజపతి రాజూ..రెచ్చిపోవద్దు..ఎప్పటికైనా జైలుకెళ్లాల్సిందే

Ashok Gajapathi Raju Vs Vijayasai Reddy Fires

Updated On : June 18, 2021 / 4:48 PM IST

మాన్సాన్ ట్రస్టుకు చైర్మన్ గా అశోక్ గజపతిరాజునే తిరిగి నియమిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పు అనంతరం అశోక్ గజపతిరాజు ఛైర్మన్ పదవిబాధ్యతలను స్వీకరించారు. అనంతరం అనంతరం ఏపీ ప్రభుత్వంపై అశోక్ గజపతిరాజు ఫైర్ అయ్యారు. నాపై దాడి చేయటానికే ప్రభుత్వం జీవోలు ఇచ్చిందనీ ఆగ్రహం వ్యక్తంచేశారు. 13 ఏళ్లు మంత్రిగా పనిచేసిన నాకు రాజకీయాలు పదవులు నాకు శాశ్వతం కాదని అన్నారు.

తనను ఛైర్మన్ పదవినుంచి అన్యాయంగా తొలగించి ప్రభుత్వం అనవసరపు రాద్దాంతం చేసిందని కానీ న్యాయం ఎన్నటికీ నిలుస్తుందని ధర్మాసనం నిరూపించిందని అన్నారు. ఈక్రమంలో ప్రభుత్వం చేతిలో అధికారులు పావులుగా మారారని అటువంటివారు జైలుకు వెళ్లాలని నేను కోరుకోవటంలేదని అన్నారు. రామతీర్థం విగ్రహం విధ్వంసం కేసులో ప్రభుత్వం ఒక్రిని కూడా అరెస్ట్ చేయలేదని ఎన్ని దేవాలయాలపై దాడులు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఒక్క నిందితుడికి కూడా అరెస్ట్ చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు.

ఈక్రమంలో అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. మాన్సాన్ ట్రస్టుకు అశోక్ గజపతిరాజు కేవలం ఛైర్మన్ మాత్రమేననీ..కోర్టు తీర్పు వచ్చినప్పటినుంచి అశోక్ గజపతిరాజు చెలరేగిపోతున్నారనీ..అంత అవసరం లేదని విజయసాయిరెడ్డి ఎదురు దాడికి దిగారు.అశోక్ గజపతిరాజు వందల ఎకరాలు దోచుకున్నారని ఆయన ఎప్పటికైనా జైలుకెళ్లాల్సిందేనని అన్నారు. ఆయన ఫోర్జరీ కేసుల్లో కూడా ఉన్న విషయం మరచిపోయి కోర్టు తీర్పు తరువాత చెలరేగిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. మహిళల పట్ల ఆయన వివక్ష చూపించారని కానీ అలా మేం ఎప్పటికీ చేయం అని అన్నారు.