Ashwani dutt: చంద్రబాబు అరెస్ట్‌పై అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు.. వారికి పుట్టగతులు ఉండవంటూ ఆగ్రహం

చంద్రబాబుపై తప్పుడు అంబాడాలు వేసి జైలుకు పంపించిన వారికి త్వరలో గుణపాఠం తప్పదని అశ్వినీదత్ అన్నారు.

Ashwani dutt: చంద్రబాబు అరెస్ట్‌పై అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు.. వారికి పుట్టగతులు ఉండవంటూ ఆగ్రహం

Ashwanidatt

Updated On : September 13, 2023 / 3:47 PM IST

Ashwani Dutt – Chandrababu Arrest : టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా ఆ  పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు (Chandrababu) ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినా కావాలనే వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు దేశంలోని పలు పార్టీలకు చెందిన నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు అరెస్టు విధానం సరికాదంటూ పేర్కొంటూ తమ మద్దతు తెలుపుతున్నారు. తాజాగా సినీ నిర్మాత అశ్వినీదత్.. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును అరెస్టు చేసిన వారికి పుట్టగతులు ఉండవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అశ్వినీదత్ వీడియోను విడుదల చేశారు.

Sidharth Luthra : న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాడటమే సరైనది : సిద్ధార్థ లూథ్రా సంచలన వ్యాఖ్యలు

ఈ దేశానికి గొప్ప ప్రధాని, స్పీకర్‌తోపాటు గొప్ప రాష్ట్రపతిని అందించిన ఘనత చంద్రబాబుదని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేకపోయిన దుర్మార్గకరంగా అరెస్టు చేసి లేనిపోని విమర్శలు చేస్తున్నారని, వారెవరికి పుట్టగతులు ఉండవని అన్నారు. చంద్రబాబుపై తప్పుడు అంబాడాలు వేసి జైలుకు పంపించిన వారికి త్వరలో గుణపాఠం తప్పదని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 175 సీట్లకు 160 సీట్లను గెలుచుకొని మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అశ్వనీదత్ దీమా వ్యక్తం చేశారు.

Also Read: కొడాలి నాని, మరో ఇద్దరు నేతలకు నాన్‌బెయిలబుల్ వారెంట్లు.. ఎందుకంటే?