Chandrababu Naidu: నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు.. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చిస్తారు.

Chandrababu Naidu: నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు.. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ

CM Chandrababu Naidu

Updated On : December 24, 2024 / 8:19 AM IST

సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర మంత్రులతోనూ సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చిస్తారు. రేపు రాత్రికి చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి వస్తారు.

కాగా, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని బీజేపీ మైనారిటీ ఫ్రంట్ డిసెంబరు 25న ‘సుపరిపాలన దినోత్సవం’ జరుపుతుంది. దేశంలోని పలు నగరాల్లో అటల్ స్మృతి సభలు నిర్వహిస్తారని బీజేపీ మైనారిటీ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ ప్రకటించారు.

బీజేపీ వ్యవస్థాపకుడిగా వాజ్‌పేయి పోషించిన పాత్ర, ఆయన ప్రధానమంత్రిగా సాధించిన విజయాలపై సభల్లో చర్చలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నారు.

మరోవైపు, ఢిల్లీలో ఇటీవలే టీడీపీ ఢిల్లీలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు 500 మంది సభ్యులుగా పేర్లు నమోదు చేసుకున్నారు. మెసోనిక్ సెంటర్ ఆఫ్ ఇండియాలో ఈ మెంబర్‌షిప్ డ్రైవ్ ను టీడీపీ నిర్వహించింది. టీడీపీ ఢిల్లీ నేత కృష్ణమోహన్‌ ఆలపాటి నేతృత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది.

టీడీపీ అభివృద్ధిపై సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. తమ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ బలపడుతోందని తెలిపారు. సమీప భవిష్యత్తులో నోయిడాతో పాటు గురుగావ్‌లోనూ టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉంటాయని అన్నారు.

AP Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. వర్షాలు కురిసే చాన్స్‌