AP Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. వర్షాలు కురిసే చాన్స్
ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తోంది.

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇవాళ వర్షాలు కురిసే ప్రాంతాలు
- శ్రీకాకుళం
- విజయనగరం
- పార్వతీపురం మన్యం
- అల్లూరి సీతారామరాజు
- విశాఖపట్నం
- అనకాపల్లి
- కాకినాడ
- డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ
- తూర్పుగోదావరి
- పశ్చిమ గోదావరి
- కృష్ణా
- ఎన్టీఆర్
- బాపట్ల
- పల్నాడు
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు పడొచ్చు
- పల్నాడు
- ప్రకాశం
- శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
- తిరుపతి
మన్యంలో చలి
మన్యంలో చలి పుటి పంజా విసరుతోంది. నిన్న జీ మాడుగులలో 9.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న ఏజెన్సీలో పొగమంచు కురవక పోవడం ఊరట కలిగించే విషయం. రాత్రుళ్లతో పాటు పగలు కూడా చలి గాలులు వీస్తున్నాయి.