వింత మేకపిల్ల పుట్టింది.. అచ్చం కోడిలానే ఉంది..!

వింత మేకపిల్ల పుట్టింది.. అచ్చం కోడిలానే ఉంది..!

Updated On : February 7, 2021 / 12:08 PM IST

baby goat born shape of hairless chicken : వింత మేకపిల్ల పుట్టింది.. అచ్చం కోడిలానే ఉంది.. వింతైన ఆకారంలో పుట్టిన మేకపిల్ల ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడటానికి కోడిలానే కనిపిస్తోంది. దాంతో ఈ మేకపిల్లను చూసేందుకు జనమంతా తరలివస్తున్నారు.

ఏపీలోని ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. పీసీపల్లి మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఎస్‌కే దస్తగిరికి చెందిన మేక ఒకే ఈతలో రెండు మేకపిల్లలకు జన్మనిచ్చింది. ఒక మేక పిల్ల 3 కిలోలు ఉండగా.. మరో మేకపిల్ల 1.5 కిలోల బరువు ఉంది. రెండు ఆరోగ్యంగానే ఉన్నాయి.

మరుసటి రోజున మేక మరో మేకపిల్లకు జన్మనిచ్చింది. అయితే ఆ మేకపిల్ల సాధారణ మేకను పోలి లేదు. వింతైన ఆకారంలో పుట్టింది. అచ్చం కోడి మాదిరిగా ముక్కు ఆకారాన్ని పోలి ఉంది. శరీరంపై వెంట్రుకలు లేవు. పావు కిలో బరువు మాత్రమే ఉంది.. పుట్టిన కాసేపటికే ఆ మేకపిల్ల మృతిచెందింది.