Bear Trapped : నంద్యాల మహానంది క్షేత్రంలో చిక్కిన ఎలుగుబంటి

ఖాళీగా ఉన్న ఇంట్లోకి ఎలుగుబంటి వెళ్లింది. ఇంటి తలుపులు వేసి ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు, స్థానికులు బంధించారు.

Bear Trapped : నంద్యాల మహానంది క్షేత్రంలో చిక్కిన ఎలుగుబంటి

bear trapped

Updated On : September 5, 2023 / 1:05 PM IST

Bear Trapped In Mahanandi : నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి చిక్కింది. ఐదు రోజుల నుండి అటవీ శాఖ సిబ్బంది, స్థానికులకు ముప్పతిప్పలు పెట్టిన ఎలుగుబంటి ఎట్టకేలకు చిక్కింది. 5 రోజులుగా ఎలుగుబంటి భక్తులను, స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది.

అర్ధరాత్రి క్షేత్రం సమీపంలోని ఎంప్లాయిస్ కాలనీ ఈశ్వరనగర్ లో ఎలుగుబంటి సంచారించింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగింది. ఎలుగుబంటిని బంధించే క్రమంలో అటవీశాఖ సిబ్బంది, స్థానికుల మధ్య గంటన్నర్ర సేపు చేజింగ్ సీన్ కనిపించింది.

Bear Viral video: కారు డోరు తెరిచి లోపలికి వెళ్ళిన ఎలుగు బంటి.. వీడియో వైరల్

ఖాళీగా ఉన్న ఇంట్లోకి ఎలుగుబంటి వెళ్లింది. ఇంటి తలుపులు వేసి ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు, స్థానికులు బంధించారు. బోను తెచ్చి ఎలుగుబంటిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.