TTD: తిరుమలలో అత్యాధునిక టెక్నాలజీతో శ్రీ వేంకటేశ్వర స్వామి మ్యూజియంకు భూమిపూజ..
తిరుమలలో అత్యాధునిక టెక్నాలజీతో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం నిర్మాణానికి శుక్రవారం టీటీడీ పాలక మండలి ఆధ్వర్యంలో భూమి పూజ జరిగింది.

Tirumala Tirupati Devasthanam
TTD Chairman Karunakar Reddy: తిరుమలలో అత్యాధునిక టెక్నాలజీతో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం నిర్మాణానికి శుక్రవారం టీటీడీ పాలక మండలి ఆధ్వర్యంలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రూ. 145 కోట్లతో తిరుమలలో ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులు ప్రారంభం అవుతున్నాయని చెప్పారు. టీసీయస్ కంపెనీ, బెంగుళూరుకు చెందిన మ్యాప్ సిస్టమ్‌తో కలసి మ్యూజియంను టీటీడీ ఆధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేస్తోందని అన్నారు. టీసీఎస్ 125 కోట్లు, మ్యాప్ సిస్టమ్ 20 కోట్లు ఖర్చుపెట్టి డిసెంబరులోపు పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. మూడు ఫ్లోర్స్‌లో శ్రీవారి ఆలయం, తిరుమలకు సంబంధించిన వివిధ అంశాలను ఏర్పాటు చేస్తారని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
TTD: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. గురువారం ఉదయం 9గంటలకు పద్మావతిపురంలోని ఇంటి వద్ద నుంచి బయలుదేరిన భూమన గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అలిపిరి వద్ద గోపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. టీటీడీ అధికారులు భూమనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం భూమన టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమలకు వచ్చే సామాన్య భక్తుడే నా మొదటి ప్రాధాన్యత అని అన్నారు.
జగన్ మోహన్‌రెడ్డి ఆశీస్సులతో పాలకమండలి అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణం చేసే ఆదృష్టం దక్కిందని కరుణాకర్ రెడ్డి అన్నారు సామాన్యుల వైపు, ఉద్యోగుల వైపు వుంటానని చెప్పారు. ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని అన్నారు.