ఏపీ రైతులకు బిగ్ అలర్ట్.. ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులొచ్చేది రేపే.. ఆ రైతులకు మాత్రమే రూ.7వేలు.. సందేహాలుంటే ఈ టోల్‌ఫ్రీం నెంబర్‌కు..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తారు.

ఏపీ రైతులకు బిగ్ అలర్ట్.. ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులొచ్చేది రేపే.. ఆ రైతులకు మాత్రమే రూ.7వేలు.. సందేహాలుంటే ఈ టోల్‌ఫ్రీం నెంబర్‌కు..

Annadata Sukhibhava Scheme

Updated On : August 1, 2025 / 10:37 AM IST

Annadata Sukhibhava Scheme: కూటమి ప్రభుత్వం అన్నదాతలకు తీపికబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించనుంది. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం కింద ఆగస్టు 2వ తేదీన రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి విడత రూ.7వేలు జమ చేయనున్నారు. ఇప్పటికే అధికారులు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. అయితే, ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హులైన రైతులందరికీ ఈ పథకం డబ్బులు పడాలని సూచించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు దీని ద్వారా లబ్ధిపొందనున్నారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5వేల చొప్పున మొత్తం రూ. 2,342.92కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది. దీనికితోడుగా కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా రూ.2వేల చొప్పు రూ.831.51కోట్లు రైతులకు సాయం అందించనుంది. మొత్తంగా.. రైతుల ఖాతాల్లో రూ.7వేలు జమ అవుతాయి.

అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించి 59,750 వినతులు నమోదు కాగా.. 58,464 దరఖాస్తులను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. ఈ పథకంపై సందేహాల నివృత్తికి 155251 టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. అయితే, ఆధార్ సీడింగ్ జరగని రైతులు లక్షల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అర్హుల జాబితాలో తమ పేర్లు కనపించక రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పలు సూచనలు చేసింది. అందుబాటులో ఉన్న రికార్డుల్లోని వివరాల ఆధారంగా అర్హులు నష్టపోకుండా చూడాలని, ఆధార్ కార్డుల్లోని వివరాల్లో మార్పులు, చేర్పులపై రైతులతో వీఆర్వోల సాయంతో దరఖాస్తు చేయించాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అన్నదాత సుఖీభవ పథకం అమలుపై వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆగస్టు 2న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామ సచివాలయం, పంచాయతీలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో అన్నదాతసుఖీభవ పథకం ప్రారంభోత్స కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలన్నారు. అన్నదాతా సుఖీభవ అందుకునే రైతుల మొబైల్స్‌కు ఒకరోజు ముందే ‘మనమిత్ర’ ద్వారా సమాచారం పంపాలని సూచించారు. ఖాతాల యాక్టివేట్ చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనాలని సూచించారు.