పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్..! ఒకేసారి 12మంది వైసీపీకి రాజీనామా

పుంగనూరులో ఇక నుంచి తండ్రీ కొడుకుల ఆటలు సాగవని, వారు ఎంత మోసగాళ్లో ప్రజలకు తెలిసిందన్నారు పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ చల్లాబాబు.

పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్..! ఒకేసారి 12మంది వైసీపీకి రాజీనామా

Peddireddy Ramachandra Reddy : పుంగనూరులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీ బాషా సహా మొత్తం 12మందికి పైగా కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్ చల్లాబాబు సమక్షంలో వారు టీడీపీలో చేరారు. పుంగనూరు మున్సిపాలిటీలో మొత్తం 31మంది కౌన్సిలర్లు ఉండగా, తాజాగా పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో పుంగనూరు మున్సిపల్ పీఠంపై టీడీపీ నేత చల్లాబాబు దృష్టి పెట్టారు.

పుంగనూరులో ఇక నుంచి తండ్రీ కొడుకుల ఆటలు సాగవని, వారు ఎంత మోసగాళ్లో ప్రజలకు తెలిసిందన్నారు పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ చల్లాబాబు. పుంగనూరులో కుటుంబపాలన సాగిస్తూ వ్యవస్థలను నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. పుంగనూరులో ఒక విధంగా, ఢిల్లీలో మరొక విధంగా మాట్లాడటం పెద్దిరెడ్డి కుటుంబానికే చెల్లిందని విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు మైనార్టీలు బీజేపీకి ఓటు వేయొద్దని తండ్రీ కొడుకులు ప్రచారం చేశారని, 10 రోజుల్లోనే వారు కేంద్రానికి మద్దతిచ్చారని విమర్శించారు.

అబద్దాలు చెప్పి పుంగనూరు ప్రజలను, మున్సిపల్ చైర్మన్ సహా కౌన్సిలర్లను పెద్దిరెడ్డి కుటుంబం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. త్వరలోనే వారి అక్రమాలు బయటపడే సమయం వచ్చిందన్నారు. వారి వైఖరి నచ్చకే కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారని తెలిపారు. పెద్దిరెడ్డి ఇలాకాలో పదవి మాత్రమే ఉంటుందని, అధికారం ఉండదని ఆరోపించారు పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీ బాషా. పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం ఎన్నో అక్రమాలు చేసిందన్నారు. ఆ నీచ రాజకీయాలు నచ్చకే తాము వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరామన్నారు అలీ బాషా.

Also Read : ఒక్క ఓటమితో సీన్ రివర్స్..! చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయనని భారీ డైలాగ్‌లు, కట్ చేస్తే..