చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాలేకపోతున్నానంటూ బీజేపీ ఎమ్మెల్యే మెసెజ్

ఎన్డీయే కూటమి తరపున ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా కామినేని శ్రీనివాస్ విజయం సాధించిన విషయం తెలిసిందే..

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాలేకపోతున్నానంటూ బీజేపీ ఎమ్మెల్యే మెసెజ్

Updated On : June 12, 2024 / 11:27 AM IST

Kamineni Srinivas : ఏపీలో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ సహా 24మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో సభా ప్రాంగణం వద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నాయి. అయితే, ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తానుప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావటం లేదని చెప్పారు.

Also Read: చంద్రబాబు క్యాబినెట్‌లో ఏఏ సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయో తెలుసా?

ఎన్డీయే కూటమి తరపున ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా కామినేని శ్రీనివాస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంకు హాజరు కావటం లేదని చెప్పారు. ఈ మేరకు వీడియోనుసైతం విడుదల చేశారు. అనారోగ్య కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావటం లేదని చెప్పారు. నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాయని, ఈ కారణంగా ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేక పోతున్నానని తెలిపారు.

Also Read: అదిగదిగో అమరావతి.. విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న రాజధాని

ఎన్డీయే తరపునసీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ తోపాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వారిని పేరుపేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు కామినేని శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు కూటమికి అద్భుతమైన విజయం ఇచ్చారని అన్నారు. ప్రధాని మోదీకూడా ప్రమాణ స్వీకారంకు వస్తున్నారు.. ఆయన సహకారంతో ఆంధ్రరాష్ట్రం తప్పక అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నానని కామినేని ఆకాంక్షించారు. కైకలూరు నియోజకవర్గం ప్రజలు ఎవరూ తనను పరామర్శించేందుకు రావొద్దు.. నేను త్వరలో కైకలూరు వచ్చి ప్రజలను కలుస్తానని కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు.