ఏపీ రాజధాని అంశంలో కేంద్రం జోక్యం పరిమితం – రాం మాధవ్

  • Published By: madhu ,Published On : August 11, 2020 / 01:18 PM IST
ఏపీ రాజధాని అంశంలో కేంద్రం జోక్యం పరిమితం – రాం మాధవ్

Updated On : August 11, 2020 / 2:49 PM IST

ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం పరిమితంగా ఉంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ తెలిపారు. గతంలో రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో..ప్రస్తుతం అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.



ప్రపంచంలో, దేశంలో ఎక్కడా మూడు రాజధానులు లేవని, యూపీలాంటి పెద్ద రాష్ట్రంలోనూ..ఒక్కటే రాజధాని ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అత్యంత జనాభా ఉన్న యూపీ రాజధాని లక్నోలో పరిపాలన సరిగ్గా జరగడం లేదా అని ప్రశ్నించారు.



అమరావతిలో భారీగా అవినీతి జరిగిందని, మూడు రాజధానులు కట్టాలని అనుకుంటున్నారని..గతంలో ఒక్క రాజధాని అవినీతిపై ఎలా పోరాటం చేశామో..మూడు అవినీతి రాజధానులపైనా..పోరాడుతామన్నారు. అమరావతి రైతులకు న్యాయం జరిగేంత వరకు బీజేపీ ముందుండి పోరాడాలన్నారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, అంతవరకు వేచి చూడాలన్నారు.