విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం..!
ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సీనియర్ నేత అయిన బొత్సను తమ అభ్యర్థిగా ప్రకటించింది.

Botcha Satyanarayana : ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దాంతో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనిపై ఈ నెల 16న రిటర్నింగ్ అధికారి.. అధికారిక ప్రకటన చేయనున్నారు. కాగా, ఎన్డీయే కూటమి ఈ ఎన్నిక నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ ను వెనక్కి తీసుకున్నారు. ఒకవేళ ఆయన తన నామినేషన్ ను ఉపసంహరించుకోకపోయుంటే.. ఈ నెల 30వ తేదీన ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండేది. మొదటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక తీవ్ర ఉత్కంఠను రేపింది. విపక్ష, అధికార పక్షాలు సై అంటే సై అనడంతో ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తాము కూడా పోటీ చేస్తామని, తమ అభ్యర్థిని నిలుపుతామని ఎన్డీయే కూటమి ప్రకటించడంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. కూటమి అభ్యర్థిగా ఎవరు ఉంటారు అనేది ఉత్కంఠకు దారితీసింది. ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సీనియర్ నేత అయిన బొత్సను తమ అభ్యర్థిగా ప్రకటించింది. బొత్స లాంటి సీనియర్ నాయకుడిని ఎదుర్కొనే వ్యక్తి కూటమి నుంచి ఎవరు ఉండబోతున్నారు అనేది తీవ్ర ఆసక్తిని రేపింది.
అయితే, చివరి నిమిషంలో కూటమి సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పోటీ నుంచి తప్పుకుంది. ఓట్ల పరంగా సంఖ్యా బలం తక్కువగా ఉండటంతో పోటీ నుంచి తప్పుకుంది ఎన్డీయే కూటమి. తాము హుందా రాజకీయాలు చేస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే, ఓటమి భయంతోనే చంద్రబాబు పోటీ నుంచి తప్పుకున్నారని వైసీపీ నేతలు మాటల దాడికి దిగారు.
Also Read : ఒంగోలులో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. చేతులెత్తేసిన మాజీమంత్రి బాలినేని..!