Break For Vaccination : విశాఖ, అనంతపురం జిల్లాల్లో టీకా ఉత్సవ్‌కు బ్రేక్‌

విశాఖ, అనంతపురం జిల్లాల్లో టీకా ఉత్సవ్‌కు బ్రేక్‌ పడింది. సరిపడ వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడంతో వైద్యాధికారులు రేపటికి వాయిదా వేశారు.

Break For Vaccination : విశాఖ, అనంతపురం జిల్లాల్లో టీకా ఉత్సవ్‌కు బ్రేక్‌

Break For Vaccination Festival In Visakhapatnam And Anantapur

Updated On : April 11, 2021 / 4:06 PM IST

Break for vaccination festival : విశాఖ, అనంతపురం జిల్లాల్లో టీకా ఉత్సవ్‌కు బ్రేక్‌ పడింది. సరిపడ వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడంతో వైద్యాధికారులు రేపటికి వాయిదా వేశారు. విశాఖలో కేవలం 560 డోసులు మాత్రమే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో నిన్ననే స్టాక్‌ అయిపోయింది. కేంద్రం నుంచి వ్యాక్సిన్‌ వస్తేనే రేపటి నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న టీకా డోసుల సంఖ్య లక్షా 35 వేలు మాత్రమే. ఇవి పూర్తిగా ఒక్క రోజుకు కూడా చాలని పరిస్థితి. సాధారణ రోజుల్లోనే రెండు లక్షల మంది లబ్ధిదారులకు ఆరోగ్య శాఖ వ్యాక్సిన్‌ అందిస్తుంది. ఇక టీకా ఉత్సవ్‌ అంటే కనీసం 10 లక్షల మందికైనా టీకా వేయాలి.

శ్రీకాకుళం మొదలుకుని అనంతపురం వరకూ ఏ జిల్లాల్లో కూడా పూర్తిస్థాయిలో డోసులు అందుబాటులో లేవు. ఆరోగ్య శాఖ ముందస్తు ప్రణాళికలు సరిగ్గా వేసుకోకపోవడం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా వ్యాక్సిన్‌ సరఫరా చేయకపోవడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది.

దేశ వ్యాప్తంగా టీకా మహోత్సవ్ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా మోడీ నాలుగు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని, టీకా ఇప్పించడంలో ఇతరులకు సాయం చేయాలన్నారు.

కరోనా సోకిన వారికి చికిత్స అందేవిధంగా చూడాలని తెలిపారు. మాస్క్ పెట్టుకోవడం, అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయాలని పేర్కొన్నారు. కరోనా కేసులు బయటపడిన ప్రాంతాల్లో మైక్రో కంటైన్మెంట్ జోన్లు స్వయంగా ఏర్పాటు చేయాలని వెల్లడించారు.