విశాఖ వరహా నదిలో పడిన ప్రైవేటు బస్సు

  • Published By: madhu ,Published On : September 10, 2020 / 06:54 AM IST
విశాఖ వరహా నదిలో పడిన ప్రైవేటు బస్సు

Updated On : September 10, 2020 / 10:48 AM IST

visakhapatnam private bus : విశాఖపట్టణంలో ఓ ప్రైవేటు బస్సుకు ప్రమాదం ఏర్పడడం కలకల రేపింది. చెన్నై నుంచి విశాఖపట్టణానికి ఓ ప్రైవేటు బస్సు వస్తోంది. 2020, సెప్టెంబర్ 09వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు ఎస్. రాయవరం మండలం పెనుగొల్లుకు చేరుకుంది.



16వ జాతీయ రహదారిపై బస్సు అదుపు తప్పింది. బ్రిడ్జీని ఢీకొని 30 అడుగుల లోతులో ఉన్న వరహానదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ మాత్రమే ఉన్నారు. ఒకరికి తీవ్రగాయాలైనట్లు సమాచారం.
https://10tv.in/fire-breaks-out-at-delhi-public-school-building/


ఘటన ప్రదేశంలో లైట్లు లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడ్డాయి. గురువారం తెల్లవారుజామున నదిలో పడిన బస్సును బయటకు తీశారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఎక్కువ మంది లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.