Bride Ran Away : తాళి కట్టే సమయానికి వధువు జంప్.. వరుడు ఏం చేశాడంటే..
చిత్తూరు జిల్లా మదనపల్లిలో విచిత్ర ఘటన జరిగింది. పెళ్లి పీటల మీద నుంచి పెళ్లి కూతురు జంప్ అయ్యింది. దీంతో వరుడు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వధువు కుటుంబంపై కేసు పెట్టారు.

Bride Ran Away
Bride Ran Away : చిత్తూరు జిల్లా మదనపల్లిలో విచిత్ర ఘటన జరిగింది. పెళ్లి పీటల మీద నుంచి పెళ్లి కూతురు జంప్ అయ్యింది. దీంతో వరుడు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వధువు కుటుంబంపై కేసు పెట్టారు. తమకు పరిహారం ఇప్పించాలని పోలీసులను కోరారు.
తంబళ్లపల్లెకు చెందిన యువతితో కర్నాటకకి చెందిన యువకుడితో వివాహం కుదిరింది. బుధవారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. కాగా, నిన్న రాత్రి ఊహించని ఘటన జరిగింది. వధువు ట్విస్ట్ ఇచ్చింది. కళ్యాణమండపం నుంచి పారిపోయింది. ఆ తర్వాత తన సమీప బంధువుని పెళ్లి చేసుకుంది.
ఈ విషయం తెలిసి వరుడు కుటుంబసభ్యులు లబోదిబోమన్నారు. తమ పరువు పోయిందని వాపోయారు. వధువు బంధువులపై పోలీస్ కేసు పెట్టారు. రూ.2 లక్షల పరిహారం ఇప్పించాలని వరుడి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.