హైకోర్టు కోసమేనా : కర్నూలులో రాజధాని కమిటీ..భూములు సేకరించాలని సూచన

రాజధాని కమిటీ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కర్నూలు అధికారులకు కమిటీ కీలక సూచనలు చేసింది. ఎయిర్ పోర్టు దగ్గర భూములు సిద్ధం చేయాలని చెప్పింది. హైకోర్టు కోసమే భూముల సేకరణ అంటూ జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై రాయలసీమ ప్రజల్లో హర్షాతీరేకాలు వ్యక్తమౌతున్నాయి. 2019, నవంబర్ 18వ తేదీ సోమవారం కడప జిల్లాలో కమిటీ పర్యటించనుంది. జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ మూడు నెలలుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వం నిపుణుల కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ 2019, నవంబర్ 17వ తేదీ ఆదివారం కర్నూలు జిల్లాలో పర్యటించింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిపుణుల కమిటీ కన్వీనర్ డీఎన్ రావుతో పాటు మరో 8 మంది కమిటీ సభ్యులు, కలెక్టర్, ఇతర జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై ఆరా తీసింది. నగర పరిధిలోని 15 కిలోమీటర్లు దూరంలో భూములు సేకరించాలని చెప్పడంతో రాయలసీమ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఓ నివేదికను కమిటీకి కలెక్టర్ ఇచ్చినట్లు సమాచారం. కర్నూలు జిల్లాకు జరిగిన నష్టాన్ని తీరుస్తామని కమిటీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రాయలసీమ విద్యార్థి, యువజన, జేఏసీ సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read More : పశ్చిమలో టెన్షన్ : చింతమనేని ఇంటికి బాబు