Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

వాళ్లు తాడిపత్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు.

Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

Updated On : October 26, 2024 / 5:17 PM IST

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ మధ్యాహ్నం శింగనమల మండలంలోని నాయనపల్లి క్రాస్‌ వద్ద ఓ కారు టైరు పగలడంతో ముందుకు వేగంగా దూసుకెళ్లి ఓ లారీని ఢీకొట్టింది.

అనంతరం ఆ కారు వచ్చిన వేగానికి అది నుజ్జునుజ్జయింది. కారులోని ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. వాళ్లు తాడిపత్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. మృతులు అందరూ అనంతపురానికి చెందినవారే.

వారి పేర్లు శ్రీధర్, ప్రసన్న, వెంకీ, సంతోష్, షణ్ముక్, వెంకన్నగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు నుంచి స్థానికుల సాయంతో పోలీసులు మృతదేహాలను వెలికితీశారు.

తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం..