దువ్వాడ శ్రీనివాస్, మాధురిలకు షాక్..! తిరుమలలో కేసు నమోదు..
పోలీసులు మూడు సెక్షన్ల కింద వారిద్దరిపై కేసు నమోదు చేశారు.

Duvvada Srinivas : ఫ్యామిలీ గొడవలతో వరుస వివాదాల్లో నిలుస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలపై కేసు నమోదైంది. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీనివాస్, మాధురిలు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్, మాధురిలపైన మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. 292, 296, 300 బీఎన్ఎస్ యాక్ట్ కింద మూడు కేసులు నమోదు చేశారు. తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించి రీల్స్ చేయడంతో పాటు మీడియాతో పర్సనల్ విషయాలు మాట్లాడారు దువ్వాడ శ్రీనివాస్, మాధురి.
ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి తిరుమల వెళ్లారు. శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరూ ఫొటోషూట్ నిర్వహించినట్లుగా వార్తలు వచ్చాయి. తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా వారిద్దరూ వ్యవహరించారని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పలువురు కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు మూడు సెక్షన్ల కింద వారిద్దరిపై కేసు నమోదు చేశారు.
మాధురి నిబంధనలను అతిక్రమించి.. తిరుమల శ్రీవారి ఆలయం మాఢ వీధుల్లో పబ్లిక్ న్యూసెన్స్ చేశారని.. ఆలయం ముందు రీల్స్ చేయడం, వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడటం.. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులకు టీటీడీ ఒక ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. చట్ట ప్రకారం ఆమెపై చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.
Also Read : ఐఏఎస్ ఆమ్రపాలికి ఊహించని షాక్ ఇచ్చిన కేంద్రం..!