Sakinetipalli SBI : ఎస్బీఐలో రూ.7.70 కోట్ల నిధుల గోల్ మాల్… క్యాషియర్ పై CBI కేసు
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి ఎస్బీఐలో క్యాషియర్ గా పని చేస్తున్న రాపాక వెంకటరమణ మూర్తిపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Sakinetipalli Sbi
Sakinetipalli SBI : తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి ఎస్బీఐలో క్యాషియర్ గా పని చేస్తున్న రాపాక వెంకటరమణ మూర్తిపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.7కోట్ల 70లక్షల రుణాల మంజూరులో గోల్ మాల్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో వెంకటరమణ మూర్తి హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 246మంది ఖాతాదారుల పేరిట బంగారంపై రుణాలు మంజూరు చేసినట్లు రికార్డులు సృష్టించారు.
దీంతో నోటీసులు రావడంతో కంగుతిన్న ఖాతాదారులు బ్యాంకు మేనేజర్ ని కలవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో విచారణ జరిపిన సీబీఐ అధికారులు.. క్యాషియర్ వెంకటరమణ మూర్తి అవకతవకలకు పాల్పడినట్టు తేల్చారు. నిందితులపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు.