CEC : ఏపీ, తెలంగాణ.. రెండు చోట్లా ఓటు ఉందా? అయితే జాగ్రత్త, సీఈసీ వార్నింగ్
ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రాన నివాసం లేకుంటే ఓటు ఇవ్వలేము అని స్పష్టం చేసింది.

CEC Warning For Voters
CEC : ఏపీలో ఓట్ల వ్యవహారంపై సీఈసీ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ, ఏపీలో రెండు చోట్లా ఓటు హక్కు ఉన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వారు ఏపీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్పవంది. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని ప్రకటించింది. ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రాన నివాసం లేకుంటే ఓటు ఇవ్వలేము అని స్పష్టం చేసింది.
Also Read : ఆ 13 మంది ఎవరు? ఎంపీ అభ్యర్థులపై వైసీపీ ముమ్మర కసరత్తు
* ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.07 కోట్లు
* రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ
* రాష్ట్రంలో మహిళా ఓటర్లు 2.07 కోట్లు, పురుష ఓటర్లు 1.99 కోట్లు
* ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశం
* 7.88 లక్షల మందికి తొలిసారి ఓటు హక్కు
* వందేళ్లు దాటిన వృద్దులు 1,174 మంది
* ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల
* రెండు చోట్ల ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు
* తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వారు ఏపీ ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తారు…?
* ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రాన.. ఏపీలో నివాసం ఉండకుండా ఉంటే ఓటు ఇవ్వలేం
Also Read : టీడీపీ రేసుగుర్రాలు రెడీ..! 72మందితో లిస్ట్..! సంక్రాంతి తర్వాత విడుదల..!