Sankranthi Wishes: తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు..!
తెలుగు ప్రజలకు రాజకీయ ప్రముఖులు భోగి, సంక్రాంతి పండగల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆనందంగా ఉండాలని తమ సందేశాల్లో ఆకాంక్షించారు.
Sankranthi Wishes: తెలుగు లోగిళ్లు.. సంక్రాంతి కళతో శోభాయమానంగా మారాయి. భోగి మంటలతో వేడుకలు రంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా.. కుటుంబాలతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతటి ఆనందకర సమయాన్ని.. ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మరింత ప్రత్యేకంగా మారుస్తున్నారు. భోగి మంటల్లో కరోనా కష్టాలు మాడిపోవాలని.. ప్రజలంతా ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాలని కోరుతున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, తెలంగాణ మంత్రి హరీష్ రావ్ సహా.. మరింత మంది ప్రముఖులు.. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
భోగి పండుగ శుభాకాంక్షలు.
ప్రతికూల ఆలోచనలు వదిలి, సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలనే సందేశాన్నిచ్చే ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లోకి నూతన కాంతులను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. #Bhogi pic.twitter.com/4Zd82W4Hr0— Vice President of India (@VPSecretariat) January 14, 2022
Bhogi greetings to everyone. May this special festival enrich the spirit of happiness in our society. I pray for the good health and well-being of our fellow citizens. pic.twitter.com/plBUW3psnB
— Narendra Modi (@narendramodi) January 14, 2022
Greetings To All On The Auspicious Occasion Of #MakarSankranti.
On this auspicious day of new beginnings, may the Surya Bhagwan bring well-being and prosperity in the lives of all.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు! pic.twitter.com/k3hs8dhcFZ
— G Kishan Reddy (@kishanreddybjp) January 14, 2022
మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2022
ప్రజల కష్టాలు భోగిమంటల్లో కాలిబూడిదవ్వాలని… రైతుకు శుభం జరగాలని… తెలుగునాట ప్రతి లోగిలి కొత్త వెలుగులు నింపుకుని భోగభాగ్యాలతో కళకళలాడాలని కోరుకుంటూ… తెలుగు వారందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.#Bhogi pic.twitter.com/yWNXZFcT9o
— N Chandrababu Naidu (@ncbn) January 14, 2022
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు#HappyBhogi? pic.twitter.com/zz4jNWiJXa
— Harish Rao Thanneeru (@trsharish) January 14, 2022
పనికిరాని వాటిని, కీడు కలిగించే వాటిని తగలబెట్టి… కొత్త వాటికి, మేలు చేసే వాటికీ ఇంట్లో చోటిమ్మని చెబుతోంది భోగి పండుగ. వస్తువులకే కాదు ప్రభుత్వాలకైనా అదే సూత్రం వర్తిస్తుంది. అప్పుడే జన జీవితాలకు కొత్త వెలుగులు వస్తాయి.(1/2)#Bhogi pic.twitter.com/GN84SKCM5F
— Lokesh Nara (@naralokesh) January 14, 2022