Telugu States Floods : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ ఆర్థిక సాయం.. రూ.3,300 కోట్లు ప్రకటన!

వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయాన్ని ప్రకటించింది.

Telugu States Floods : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ ఆర్థిక సాయం.. రూ.3,300 కోట్లు ప్రకటన!

Andhra Pradesh And Telangana Floods ( Image Source : Google )

Telugu States Floods : తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. వరదలు ముంచెత్తడంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికే, వరద ప్రభావిత ప్రాంతాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అవసరమైన చర్యలు చేపట్టాయి.

వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. వరదలతో నష్టపోయిన రెండు రాష్ట్రాలకు మొత్తంగా రూ. 3300 కోట్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది.

తక్షణ సహయ చర్యలకు నిధులను విడుదల చేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఏపీలోని విజయవాడ నగర పరివాహిక ప్రాంతాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వరద బాధితుల కోసం కేంద్రం నిధులను విడుదల చేయనుంది.

ఇటీవలే, కేంద్ర బృందంతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను ఈ బృందం పరిశీలించింది. తెలంగాణ సెక్రటేరియట్‌లో కేంద్ర మంత్రి చౌహాన్ వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా పరిశీలించారు.

Read Also : Jani Master : వ‌ర‌ద‌ల్లో జానీ మాస్ట‌ర్ సాయం.. 500 మందికి..