అన్నింటికి బదులిస్తాం : జగన్ కనుమరుగు అవుతారు..బాబు జోస్యం

పోలీసులు, అధికారులు, నేతల వ్యవహారాన్ని గుర్తు పెట్టుకుంటున్నా..అన్నింటికి బదులు ఇస్తాం..సీఎం జగన్ ఎంత ఫాస్ట్‌గా వచ్చాడో..అంతే ఫాస్ట్‌గా రాజకీయంగా కనుమరుగువుతారని చంద్రబాబు జోస్యం చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని బాబు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు టీడీపీ సంఘీభావం తెలుపుతోంది. అందులో భాగంగా ఆందోళనలు, నిరసనల్లో బాబు పాల్గొంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వాన కురిపిస్తున్నారు.
2020, ఫిబ్రవరి 05వ తేదీ బుధవారం తుళ్లూరులో అమరావతి రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న రైతులకు చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై బాబు ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పాలన కోసం రాలేదని, కేవలం కక్ష తీర్చుకొనేందుకు వచ్చారని దుయ్యబట్టారు.
రాజధానికి సామాజిక ముద్ర వేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రైతుల గురించి మాట్లాడాలని అనుకుంటే..సీఎం తుళ్లూరు, మందడం వెళ్లాలని సూచించారు.
* మూడు రాజధానులంటూ సీఎం జగన్ నిర్ణయాన్ని అమరావతి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
* అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. అమరావతిలో అభివృద్ధి కొనసాగుతుందన్నారు.
* తాను మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని జగన్ ప్రకటించారు.
* అమరావతిలోనే లెజిస్లేటివ్ క్యాపిటల్ కొనసాగుతుందని వెల్లడించారు.
* ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత అమరావతిలో పర్యటించేందుకు పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయిపోయారు.
* మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ అమరావతి ప్రాంత వాసులు చేస్తున్న ఆందోళనలు 50వ రోజుకు చేరుకున్నాయి.
* తుళ్లూరులో అమరావతి రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న రైతులకు చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు.
* ఏపీలో మూడు రాజధానుల అంశం తమ దృష్టికి వచ్చిందని, రాజధాని ఎక్కడ ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వందే నిర్ణయమని కేంద్రం తేల్చేసింది.