Ramakrishna : కేంద్రం సహకారంతోనే చంద్రబాబు అరెస్ట్.. లండన్ నుంచే జగన్ మానిటరింగ్ చేస్తున్నాడు : రామకృష్ణ

జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ను ఎందుకు ఆపారని ప్రశ్నించారు. సంఘీభావం తెలిపేందుకు కూడా అనుమతినివ్వరా అని నిలదీశారు.

Ramakrishna : కేంద్రం సహకారంతోనే చంద్రబాబు అరెస్ట్.. లండన్ నుంచే జగన్ మానిటరింగ్ చేస్తున్నాడు : రామకృష్ణ

CPI Secretary Ramakrishna

Updated On : September 10, 2023 / 12:13 PM IST

CPI Secretary Ramakrishna : చంద్రబాబు అరెస్టు విషయంలో సీఎం జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు చేశారు. లండన్ నుంచే చంద్రబాబు అరెస్టును జగన్ మానిటరింగ్ చేస్తున్నాడని రామకృష్ణ అన్నారు. దమ్మున్నోడని చెప్పే జగన్ లండన్ కు వెళ్ళి ఎందుకు దాక్కున్నాడని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శించారు. సీఐడీని జగన్ ప్రైవేట్ సైన్యంగా మార్చుకున్నారని ఆరోపించారు.

ఈ మేరకు ఆదివారం తిరుపతిలో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. అవినాష్ రెడ్డికి ఒక రూల్..చంద్రబాబుకు ఇంకో రూలా అని నిలదీశారు. అవినాష్ రెడ్డి కేసులో సీబీఐకి ఎందుకు సహకరించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు విషయంలో మాత్రం సీఐడీ తెగ హడావిడి చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని విమర్శించారు.

Kinjarapu Atchannaidu: జగన్ పిచ్చి పరాకాష్టకు చేరింది.. అవినీతి జరిగిందని ఒక ఊహాలోకాన్ని సృష్టించారు

జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ను ఎందుకు ఆపారని ప్రశ్నించారు. సంఘీభావం తెలిపేందుకు కూడా అనుమతినివ్వరా అని నిలదీశారు. రేపు (సోమవారం) విజయవాడకు వెళుతున్నానని చంద్రబాబుకు సంఘీభావం చెబుతున్నామని తెలిపారు.

సోమవారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, ప్రతిపక్ష పార్టీలన్నీ సమావేశానికి హాజరవ్వాలని కోరారు. చంద్రబాబు అరెస్ట్ పై ప్రజా సంఘాలు స్వచ్ఛంధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.