Chandra Babu: చిరంజీవి జగన్‌ని ప్రాధేయపడాలా? హోదాపై యుద్ధం ఎక్కడ? -చంద్రబాబు
సీఎం జగన్‌రెడ్డి.. హోదాపై మీ యుద్ధం ఎక్కడ? పలాయనవాదమెందుకు? అని ముఖ్యమంత్రి జగన్‌ని నిలదీశారు నారా చంద్రబాబు.

Chandrababu
Chandra Babu: సీఎం జగన్‌రెడ్డి.. హోదాపై మీ యుద్ధం ఎక్కడ? పలాయనవాదమెందుకు? అని ముఖ్యమంత్రి జగన్‌ని నిలదీశారు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రాజీనామాలపై నాటి మీ సవాళ్లు ఏమయ్యాయని నిలదీశారు. ప్రత్యేకహోదాపై ప్రజలకు జగన్‌రెడ్డి సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు.
కేంద్రం ఎజెండాలో ప్రత్యేక హోదా తమ ఘనతేనని చెప్పుకున్న వైసీపీ.. ఇప్పుడు తమపై బురద జల్లుతారా? అని ప్రశ్నించారు. ఏపీ ఆదాయం తగ్గకపోయినా ఆర్థికవ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీకి లేని సమస్యను సృష్టించి, సినిమా హీరోలను కూడా జగన్ అవమానించారని అన్నారు.
స్వశక్తితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటివారు జగన్‌ని ప్రాధేయపడాలా? అని ప్రశ్నించారు. ప్రపంచ స్థాయికి ఎదిగిన తెలుగు సినిమా పరిశ్రమని జగన్‌రెడ్డి కించపరిచారని విమర్శించారు. గ్రామాల్లో విద్యార్థులకు బడులను దూరం చేయడమే “నాడు నేడు” పథకమా? అని నిలదీశారు. రాష్ట్రంలో కరెంట్ సరఫరా లేకుండా పోయిందని, అధిక బిల్లులు మాత్రం వస్తున్నాయని అన్నారు.
విద్యుత్ మోటర్లకు మీటర్ల బిగింపును ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. పేదలకు చేరాల్సిన నరేగా పనుల్లో వైసిపి అవినీతిపై టిడిపి పోరాటం చేస్తుందని, విశాఖ ఉక్కుపై ఎందుకు చేతులు కట్టుకుని కూర్చున్నాడో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.