Chandrababu : బెయిల్, ముందస్తు బెయిల్ కోసం.. ఏపీ హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు

చంద్రబాబు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సివుందని పిటిషన్ లో లాయర్లు పేర్కొన్నారు. వైద్యులు ఇచ్చిన నివేదికలోని మిగతా అంశాలపైనా వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందంటూ పిటిషన్ వేశారు.

Chandrababu : బెయిల్, ముందస్తు బెయిల్ కోసం.. ఏపీ హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు

Chandrababu House Motion petition (1)

Updated On : October 26, 2023 / 3:38 PM IST

Chandrababu House Motion petition : ఏపీ హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టాలని చంద్రబాబు తరపున లాయర్లు హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఎడమ కంటికి మూడు నెలల క్రితం క్యాటరాక్టు ఆపరేషన్ జరిగిందని తెలపారు.

ఇప్పుడు చంద్రబాబు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సివుందని పిటిషన్ లో లాయర్లు పేర్కొన్నారు. వైద్యులు ఇచ్చిన నివేదికలోని మిగతా అంశాలపైనా వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందంటూ పిటిషన్ వేశారు. శరీరంపై దద్దుర్లతో పాటు వెన్ను కిందిభాగంలో నొప్పితో బాధపడుతున్నారని హెల్త్ రిపోర్టులో ఉంది.

Kavitha : కేసీఆర్ పై ఎవరు పోటీ చేసినా ఓటమి ఖాయం : ఎమ్మెల్సీ కవిత

చంద్రబాబు లయర్లు పిటిషన్ కు హెల్త్ రిపోర్టు జత చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. నాంపల్లి ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.