Yuvagalam Padayatra: 200వ రోజుకు చేరిన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్..

యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా లోకేశ్, యువగళం పాదయాత్ర టీంకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

Yuvagalam Padayatra: 200వ రోజుకు చేరిన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్..

Chandrababu Naidu

Chandrababu Naidu: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 27న కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర నేటికి 200వ రోజుకు చేరుకుంది. లోకేశ్ పాదయాత్ర ఇప్పటి వరకు 77 నియోజకవర్గాల్లో 2,710 కిలోమీటర్ల మేర సాగింది. 185 మండలాలు, మున్సిపాలిటీలు, 1675 గ్రామాల మీదుగా లోకేశ్ పాదయాత్ర కొనసాగింది. యువగళం పాదయాత్రలో భాగంగా లోకేశ్ బహిరంగ సభలు, ముఖాముఖీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో 64 బహిరంగ సభలు, 132 ముఖాముఖి సమావేశాలు, ఎనిమిది రచ్చబండ, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో లోకేశ్ పాల్గొన్నారు.

Yuvagalam Padayatra : లోకేష్ యువగళం పాదయాత్ర 2500 కిలోమీటర్లు పూర్తి.. కృష్ణా జిల్లాలోకి ప్రవేశం

లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం పోలవరం నియోజకవర్గంలో కొనసాగుతుంది. 200వ రోజు గురువారం పాదయాత్ర చింతలపూడి, సీతంపేట, బయ్యనగూడెం తదితర ప్రాంతాల మీదుగా రాత్రి పొంగుటూరుకు చేరుకుంటుంది. పాదయాత్ర విజయవంతంగా 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లోకేశ్ ను అభినందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Nara Lokesh : జగన్ పని అయిపోయింది, వచ్చేది మన ప్రభుత్వమే, 20లక్షలు ఉద్యోగాలు ఇస్తాం- నారా లోకేశ్

యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా లోకేశ్, యువగళం పాదయాత్ర టీంకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. యువగళం ప్రజాగళం అయిందని అభినందించారు. ‘యువత గొంతు నుంచి యువగళం ప్రజల గొంతుకగా ఎదిగింది. మంచి పనిని కొనసాగించండి.. నారా లోకేశ్, యువగళం జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నా’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.