చంద్రబాబు అనే నేను.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు .. Live Update
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11.33 గంటలకు ఆయన ప్రమాణం చేశారు.

Chandrababu Naidu oath taking ceremony
Chandrababu Naidu oath taking ceremony : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11.33 గంటలకు ఆయన ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు వేదికపై ఆశీనులయ్యారు.
LIVE NEWS & UPDATES
-
చిరంజీవి, పవన్ కల్యాణ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం రజనీకాంత్ దంపతులు, నందమూరి బాలకృష్ణ, వేదికపై ఉన్న కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో ప్రధాని కరచాలనం చేశారు.
-
మంత్రి వర్గం సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్, చంద్రబాబు గ్రూప్ ఫొటో దిగారు.
అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రధాని మోదీని సన్మానించి, వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు.
-
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
కొండపల్లి శ్రీనివాస్ అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
వాసంశెట్టి శుభాష్ అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా వాసంశెట్టి శుభాష్ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
సవిత అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా ఎస్. సవిత దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
టీజీ భరత్ అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా టీజీ భరత్ దైవసాక్షిగా ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేశారు.
-
బీసీ జనార్దన్ రెడ్డి అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
గుమ్మడి సంధ్యారాణి అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
కందుల దుర్గేశ్ అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా కందుల దుర్గేశ్ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
గొట్టిపాటి రవికుమార్ అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
వీరాంజనేయ స్వామి అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా డోలా బాల వీరాంజనేయ స్వామి దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
కొలుసు ప్రార్థసారధి అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా కొలుసు ప్రార్థసారధి దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
అనగాని సత్యప్రసాద్ అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
పయ్యావుల కేశవ్ అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా పయ్యావుల కేశవ్ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
ఆనం రాంనారాయణ రెడ్డి అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా ఆనం రాంనారాయణరెడ్డి దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
ఎన్ఎండీ ఫరూఖ్ అనే నేను..
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఎన్ఎండీ ఫరూఖ్ అల్లా సాక్షిగా ప్రమాణం చేశారు.
-
నిమ్మల రామానాయుడు అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా నిమ్మల రామానాయుడు దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
సత్యకుమార్ యాదవ్ అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
వంగలపూడి అనిత అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా వంగలపూడి అనిత దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
నారాయణ అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా పుంగూరు నారాయణ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
నాదెండ్ల మనోహర్ అనే నేను..
ఆంద్రప్రదేశ్ మంత్రిగా నాదెండ్ల మనోహర్ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
కొల్లు రవీంద్ర అనే నేను..
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కొల్లు రవీంద్ర దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
అచ్చెన్నాయుడు అనే నేను..
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కింజరపు అచ్చెన్నాయుడు దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
లోకేశ్ అనే నేను..
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం చంద్రబాబు పాదాలకు నమస్కారం చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నారా లోకేశ్ ను అభినందించారు.
-
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను..
జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు. దైవసాక్షిగా ప్రమాణం చేసిన జనసేనాని.పవన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సభా ప్రాంగణం పవన్ నామస్మరణతో మారుమోగిపోయింది.
ప్రమాణ స్వీకారం అనంతరం చిరంజీవి పాదాలకు పవన్ నమస్కారం చేశారు.
-
దైవసాక్షిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.. చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా సభా ప్రాంగణం చంద్రబాబు నామస్మరణతో మారుమోగిపోయింది.
ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబును ఆలింగనం చేసుకొని అభినందించారు.
-
సభా వేదికపైకి ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేరుకున్నారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు.
-
చెల్లెల్ని ముద్దాడిన బాలయ్య..
నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రమాణ స్వీకార సభా వేదికపైకి చేరుకున్నారు. నందమూరి బాలకృష్ణ అక్కడకు చేరుకొని చెల్లెలు భువనేశ్వరి నుదిటిపై ముద్దాడి ఆశీర్వదించారు.
-
ప్రమాణ స్వీకారోత్సవ సభా ప్రాంగణానికి విచ్చేసిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
-
ప్రమాణ స్వీకారోత్సవ సభాప్రాంగణానికి చేరుకున్న సినీ హీరో రాం చరణ్
-
చంద్రబాబు నాయుడు నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.
పుట్టపర్తిలో సత్యమ్మ ఆలయం వద్ద జంతుబలులు బలిఇచ్చి మొక్కులు చెల్లించుకున్న టీడీపీ కార్యకర్తలు.
కేక్ కట్ చేసి భారీ ర్యాలీ నిర్వహించిన టిడిపి కార్యకర్తలు.
నియోజకవర్గ వ్యాప్తంగా పలుచోట్ల బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని తిలకిస్తున్న ప్రజలు.
-
గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్.
గన్నవరం నుంచి కేసరపల్లికి బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ.
-
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో విజయవాడ కృష్ణా నదిలో పడవల ర్యాలీ.
అమరావతి ఇసుక పడవల యాజమాన్యం అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ర్యాలీ తీశారు.
బోట్లపై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు కనిపించాయి.
-
ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
-
ప్రమాణ స్వీకారోత్సవ వేదికపైకి చేరుకున్న కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
-
గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
-
సభావేదికపై బాలకృష్ణ కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్న నారా లోకేశ్
-
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన రజనీకాంత్ దంపతులు, మెగాస్టార్ చిరంజీవి.
వేదికపై ఒకేచోట ఆశీనులైన రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ
-
విజయవాడ వారధిపై భారీగా ట్రాఫిక్ జామ్..
గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రాయలసీమ జిల్లాల నుండి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్న కార్యకర్తలు..ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో భారీగా వస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు.
-
సభా ప్రాంగణానికి బాలకృష్ణ రావడంతో జై బాలయ్య అంటూ సభా ప్రాంగణం మార్మోగింది.
-
ప్రమాణ స్వీకార సభా ప్రాంగణానికి నారా లోకేశ్, బాలకృష్ణ చేరుకున్నారు. బాలకృష్ణ వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు.
నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణి, నారా దేవాన్ష్ లు హాజరయ్యారు.
-
శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం సందర్బంగా ప్రత్యేక ఏర్పాట్లు
నియోజకవర్గ కేంద్రాల్లో ప్రమాణస్వీకార మహోత్సవాన్ని వీక్షించేలా ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసిన అధికారులు
-
చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా నల్లజర్ల లో ఎక్కడికక్కడే నిలిచిపోయిన భారీ వాహనాలు.
తాడేపల్లిగూడెం వైపు రూట్ మళ్లించడంతో పది కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్.
భారీ వాహనాలు రోడ్డు పక్కనే నిలిపివేయడంతో ముందుకు కదలలేని వాహనాలు.
తీవ్ర ఇబ్బందులకు గురువుతున్న వాహనదారులు.
-
గన్నవరం ఎయిర్ పోర్టుకు బయలుదేరినన్న చంద్రబాబు నాయుడు
ప్రధాని నరేంద్ర మోడీకి స్వయంగా స్వాగతం పలకనున్న చంద్రబాబు నాయుడు
గన్నవరం ఎయిర్ పోర్టు, కేసరపల్లి సమీపంలో పూర్తిస్థాయి పోలీస్ బందోబస్తు
11:27 నిమిషాలకు సీఎంగా ప్రమాణం ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు
ముఖ్యఅతిథిగా హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోడీ
రాత్రికే విజయవాడ చేరుకున్న కేంద్ర మంత్రులు, సినీ రంగ ప్రముఖులు ,వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు
-
నారా చంద్రబాబు నాయుడి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన కేంద్రమంత్రి చిరాగ్ కుమార్ పాశ్వాన్
గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కేంద్రమంత్రి చిరాగ్ కుమార్ పాశ్వాన్ కు ఆహ్వానం పలికిన విజయవాడ ఎం.పి కేశినేని శివ నాథ్(చిన్ని)
కేశినేని శివ నాథ్ తోపాటు కేంద్రమంత్రి చిరాగ్ కుమార్ పాశ్వాన్ కు పూల మొక్క అందించి స్వాగతం పలికిన అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి.
-
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం లైవ్ ..