Chandrababu Naidu : వైఎస్ వివేకా కేసులో సీఎం జగన్ పాత్ర బహిర్గతమైంది- చంద్రబాబు

Chandrababu Naidu : వివేకా హత్య గురించి ఉదయం 6గంటలకు ముందే జగన్ కి తెలుసునని సీబీఐ స్పష్టం చేసినందున ఇప్పుడు ప్రశ్నించటానికి ఆస్కారం ఉన్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని చంద్రబాబు అన్నారు.

Chandrababu Naidu : వైఎస్ వివేకా కేసులో సీఎం జగన్ పాత్ర బహిర్గతమైంది- చంద్రబాబు

Chandrababu Naidu (Photo : Google)

Updated On : May 29, 2023 / 1:43 PM IST

Chandrababu – YS Jagan : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వైఎస్ వివేకా కేసులో ఏపీ సీఎం జగన్ పేరుని సీబీఐ ప్రస్తావించడం కలకలం రేపుతోంది. రాజకీయవర్గాల్లో ఒక్కసారిగా దుమారం రేగింది. వివేకా కేసులో సీఎం జగన్ పేరుని సీబీఐ ప్రస్తావించిన అంశం టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చకు వచ్చింది. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించారు. వివేకా హత్య కేసులో జగన్ పాత్ర జగమెరిగిన సత్యం అన్నారాయన. సీబీఐ ప్రస్తావనతో జగన్ పాత్ర బహిర్గతమైందన్నారు.

వివేకా హత్య గురించి జగన్ కు ఉదయం 6గంటలకు ముందే తెలుసని సీబీఐ స్పష్టం చేసినందున ఇప్పుడు ప్రశ్నించటానికి ఆస్కారం ఉన్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని చంద్రబాబు అన్నారు. ఈ కేసుని ఎన్ని మలుపులైనా తిప్పుతారని చంద్రబాబు అన్నారు. అంత:పుర కుట్ర బయటడుతుందనే అవినాశ్ ను ఇన్నాళ్లూ అరెస్ట్ కాకుండా చూశారని, సీబీఐకి సహకరించకుండా పోలీసులను అడ్డుపెట్టుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. వివేకా హత్య కేసులో జగన్ పేరును సీబీఐ ప్రస్తావించటంపై పొలిట్ బ్యూరోలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. కోర్టు వాదనలపై పొలిట్ బ్యూరోకు పార్టీ న్యాయ విభాగం వివరించింది.

Also Read..YS Viveka Case : వైఎస్ వివేకా కేసులో సీఎం జగన్ పేరు.. సీబీఐ సంచలనం

ఇక, అమరావతిలో గృహ నిర్మాణంపై పొలిట్ బ్యూరోకి వివరించారు నారా లోకేశ్. సీఆర్డీఏ చట్టoలో పేదల నివాసానికి 5శాతం భూమి తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిందన్నారు. రాజధానిగా అమరావతిని అవమానిస్తూ వచ్చిన జగన్.. ఎన్నికలొస్తుంటే అదే అమరావతి గొప్ప ప్రాంతంగా కనిపిస్తోందని విమర్శించారు. రాజధానిగా అమరావతి ఉంటే భూముల ధరలు పెరుగుతాయని తెలుగుదేశం చెబుతూ వచ్చిన విషయాన్నే ఇవాళ ఎకరా 10 కోట్లు అంటూ జగన్ కూడా నిర్ధారించారు అని చెప్పారు.