Chandrababu : గవర్నర్ జోక్యం చేసుకోవాలి-గన్నవరం విధ్వంసంపై చంద్రబాబు

గన్నవరం టీడీపీ ఆఫీసులో వైసీపీ కార్యకర్తల విధ్వంసంపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలపై గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. పోలీసు శాఖను మూసేశారా? వైసీపీలో విలీనం చేశారా? అంటూ ఫైర్ అయ్యారు. (Chandrababu)

Chandrababu : గవర్నర్ జోక్యం చేసుకోవాలి-గన్నవరం విధ్వంసంపై చంద్రబాబు

Updated On : February 20, 2023 / 8:21 PM IST

Chandrababu : కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ ఆఫీస్ పై వైసీపీ కార్యకర్తల దాడి కలకలం రేపింది. టీడీపీ ఆఫీసులో వైసీపీ కార్యకర్తల విధ్వంసంపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి, కారుకు నిప్పు పెట్టిన ఘటనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలపై గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. పోలీసు శాఖను మూసేశారా? వైసీపీలో విలీనం చేశారా? అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.

Also Read..Andhra Pradesh : గుడివాడ గుట్కా నాని, పిల్లసైకో వల్లభనేని వంశీ ఒళ్లుదగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది : టీడీపీ నేత ఘాటు వార్నింగ్

గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండించారు చంద్రబాబు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న సీఎం జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయం అని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏం కాస్తున్నారు? అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.(Chandrababu)

”రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారు. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ. రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. కారకులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు చంద్రబాబు.

గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. చంద్రబాబు, లోకేశ్ లను ఎమ్మెల్యే వంశీ తీవ్ర పదజాలంతో విమర్శించడంతో రగడ మొదలైంది. వంశీపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీపై అదే స్థాయిలో విమర్శలకు దిగారు. దాంతో, మా నాయకుడినే విమర్శిస్తారా? అంటూ వంశీ అనుచరులు రెచ్చిపోయారని.. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారని.. టీడీపీ కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేసి, ఆఫీసు ఆవరణలో ఉన్న కారుకు నిప్పంటించారని టీడీపీ నేతలు ఆరోపించారు.(Chandrababu)

Also Read..Andhra Pradesh Politics : అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవటంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. ఎమ్మెల్యే వంశీ కనుసన్నల్లోనే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. వైసీపీ రౌడీ మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి రౌడీ పాలనకు పరాకాష్ఠ అన్నారు. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.