Chandrababu Naidu: తహసీల్దార్ ఆఫీసులోకి వేలాది గొర్రెలను తోలి.. కాపరులు నిరసనకు దిగాల్సి వచ్చింది: వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు

పాలకులకు తోలు మందం అయితే... గొర్రెల మేతకు కూడా కష్టం వస్తుందని చంద్రబాబు అన్నారు.

Chandrababu Naidu: తహసీల్దార్ ఆఫీసులోకి వేలాది గొర్రెలను తోలి.. కాపరులు నిరసనకు దిగాల్సి వచ్చింది: వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు

Updated On : August 21, 2023 / 2:11 PM IST

Chandrababu Naidu – Viral Video: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లా కురిచేడు తహసీల్దార్ కార్యాలయంలోకి వేలాది గొర్రెలను తోలి కాపరులు నిరసనకు దిగారంటూ టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.

” పాలకులకు తోలు మందం అయితే… గొర్రెల మేతకు కూడా కష్టం వస్తుంది. దర్శి నియోజకవర్గం కురుచేడు మండలం గొర్ల పాలెంలో అదే జరిగింది. గొర్రెలు మేతకు వెళ్లే కొండ పోరంబోకు భూమి ఆక్రమణకు గురి కావడంతో తహసీల్దార్ కార్యాలయంలోకి వేల గొర్రెలను తోలి కాపరులు నిరసనకు దిగాల్సి వచ్చింది. ఈ దున్నపోతు ప్రభుత్వం అలసత్వం వీడి గొర్రెల పెంపకం దారుల సమస్యను వెంటనే పరిష్కరించాలి ” అని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

కాగా, సమస్యలను పరిష్కారించాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోకపోవడంతో గొర్రెల కాపర్లు దాదాపు పదివేల గొర్రెలను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి నిరసన తెలిపారు. అధికారులు ఇప్పటికైనా నిద్ర లేవాలని వారు డిమాండ్ చేశారు.

Revanth Reddy: కాంగ్రెస్‌లో చేరిన మరింత మంది బీఆర్ఎస్ నేతలు.. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?