సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. పులివెందులలో సంబరాలు

చంద్రబాబు నాయుడు సీఎంగా, పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా విజయవాడ కృష్ణా నదిలో పడవల ర్యాలీ నిర్వహించారు.

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. పులివెందులలో సంబరాలు

Chandrababu Naidu swearing ceremony

Chandrababu Naidu oath taking ceremony : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11.33 గంటలకు చంద్రబాబుతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు వేదికపై ఆశీనులయ్యారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ నియోజవకర్గం పులివెందులలో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నితాకాయి.

Also Read : మోదీ, చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ.. వీడియో వైరల్

కడప జిల్లా పులివెందుల పట్టణంలోని పులివెందుల సర్కిల్ వద్ద టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా పులివెందుల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బస్సుల్లో ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. మరోవైపు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. పుట్టపర్తిలో సత్యమ్మ ఆలయం వద్ద జంతు బలి ఇచ్చి టీడీపీ కార్యకర్తలు మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి, భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు చోట్ల బిగ్ స్క్రీన్లు ఏర్పాటుచేసి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రజలు తిలకించారు.

Also Read : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాలేకపోతున్నానంటూ బీజేపీ ఎమ్మెల్యే మెసెజ్

చంద్రబాబు నాయుడు సీఎంగా, పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా విజయవాడ కృష్ణా నదిలో పడవల ర్యాలీ నిర్వహించారు. అమరావతి ఇసుక పడవల యాజమాన్యం అసోసియేషన్ ఆధ్వర్యంలో పడవలకు టీడీపీ, జనసేన జెండాలు కట్టి పడవల ర్యాలీ నిర్వహించారు. రాయపూడి, వెంకటాపాలెం నుంచి సుమారు 20 పడవలతో మత్స్యకారులు ర్యాలీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.