బాబు సాష్టాంగ నమస్కారం

అమరావతిలో పర్యటిస్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు..ఏపీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ బాబు సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రత్యేకంగా పూజలు చేశారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం బాబు చేస్తున్న అమరావతి టూర్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. ఈ పర్యటనను కొంతమంది రైతులు వ్యతిరేకిస్తుండగా..మరికొంతమంది రైతులు స్వాగతిస్తున్నారు. బాబు ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పులు, రాళ్లతో దాడి చేయడంతో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య టూర్ కొనసాగుతోంది. ఆత్మగౌరవానికి ప్రతీకగా అయిన అమరావతిని కాపాడుకొనేందుకే తాను ఈ పర్యటన చేస్తున్నట్లు బాబు వెల్లడించారు.
సీడ్ యాక్సెస్ రోడ్డులో బాబును అడ్డుకొనేండుకు ప్రయత్నించారు. రాళ్లు విసరడంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. బాబు గో బ్యాక్ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేయగా..పోటీగా జై చంద్రబాబు అంటూ టీడీపీ వర్గీయులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అక్కడనే ఉన్న పోలీసులు ఇరువర్గాలను శాంతింప చేసే ప్రయత్నం చేశారు.
పర్యటనలో భాగంగా అమరావతి రైతులతో ప్రత్యేకంగా బాబు సమావేశం కానున్నారు. బలహీనవర్గాల వారి కోసం నిర్మించిన గృహ సముదాయాన్ని సందర్శించనున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న భవనాలు, జడ్జీల బంగ్లాలను పరిశీలించనున్నారు బాబు. మొత్తానికి బాబు టూర్ రచ్చ రచ్చ అవుతోంది. పర్యటన అనంతరం బాబు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.
Read More : వైసీపీ కుట్రలను బయటపెట్టేందుకు : అమరావతి పర్యటనపై చంద్రబాబు
గంగాయమునాదుల పవిత్ర జలంతో తడిసి, ఒక పవిత్ర సంకల్పానికి ఊపిరినిచ్చిన రాజధాని శంకుస్థాపన ప్రదేశమిది.#ChaloAmaravati#PeoplesCapitalAmaravati#SaveAmaravati pic.twitter.com/Rgnhgwt8TP
— N Chandrababu Naidu (@ncbn) November 28, 2019