Vangaveeti Radha: వంగవీటి రాధాకు చంద్రబాబు ఫోన్.. పోరాడుదాం!

వంగవీటి రాధాకు ఏం జరిగినా ఏపీ ప్రభుత్వానిదే బాధ్యతయని అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.

Vangaveeti Radha: వంగవీటి రాధాకు చంద్రబాబు ఫోన్.. పోరాడుదాం!

Vangaveeti

Updated On : December 29, 2021 / 9:26 AM IST

Vangaveeti Radha: వంగవీటి రాధాకు ఏం జరిగినా ఏపీ ప్రభుత్వానిదే బాధ్యతయని అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. వంగవీటి రాధా హత్యకు జరిగిన కుట్ర, రెక్కీపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి లేఖ రాశారు చంద్రబాబు. గుండారాజ్‌లు బెదిరింపుల పరంపరలో వంగవీటి రాధాకృష్ణను టార్గెట్ చేశారని లేఖలో ప్రస్తావించారు చంద్రబాబు.

రాధాపై రెక్కీ చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని, చట్ట వ్యతిరేక చర్యలు ఆటవిక పాలనను తలపిస్తున్నాయని లేఖలో ప్రస్తావించారు. హింసాత్మక సంఘటనలపై కఠినచర్యలు లేకపోవడంతో పదే పదే ఇటు రిపీట్ అవుతున్నాయని అన్నారు.

వంగవీటి రాధాకృష్ణకు కూడా చంద్రబాబు ఫోన్‌ చేశారు. రెక్కీ జరిగిందన్న రాధా వ్యాఖ్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్లను తిరస్కరించడం సరికాదని అన్నారు. భద్రత విషయంలో అశ్రద్ధ వద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. టీడీపీ పూర్తిగా అండగా నిలబడుతుందని, కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని రాధాతో అన్నారు చంద్రబాబు.