Minister Peddireddy : చంద్రబాబు రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలను పోలీసులపై దాడికి పాల్పడేలా చేశారు : మంత్రి పెద్దిరెడ్డి

చంద్రబాబు రాజకీయంగా దివాలా తీశారని అన్నారు. అంతులేని ఆవేదన, ఆలోచనతో బాధ పడుతున్నారని తెలిపారు.

Minister Peddireddy : చంద్రబాబు రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలను పోలీసులపై దాడికి పాల్పడేలా చేశారు : మంత్రి పెద్దిరెడ్డి

Peddireddy Fire Chandrababu

Minister Peddireddy Fire Chandrababu : చంద్రబాబు రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలను పోలీసులపై దాడికి పాల్పడేలా చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అనరాని మాటలు అంటూ ప్రజలను రెచ్చగొట్టారని పేర్కొన్నారు. పోలీసులపై ఈ స్థాయిలో దాడి జరిగిన ఘటనలు ఇటీవల కాలంలో లేవన్నారు. కుప్పంలో ఒడిపోతానన్న భయంతోనే చంద్రబాబు ఈ నీచానికి దిగజారారని మండిపడ్డారు.

శుక్రవారం పుంగనూరు దాడిలో గాయపడి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. శుక్రవారం ఘటన అనంతరం బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం ఉదయం చిత్తూరులో మంత్రికి పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు.

Governor Tamilisai : ప్రభుత్వం వివరణతో కూడిన సమాధానం ఇస్తేనే టీఎస్ఆర్టీసీ బిల్లుకు ఆమోదం : గవర్నర్ తమిళిసై

చంద్రబాబు రాజకీయంగా దివాలా తీశారని అన్నారు. అంతులేని ఆవేదన, ఆలోచనతో బాధ పడుతున్నారని తెలిపారు. పుంగనూరు బైపాస్ నుండి వెళ్తామని పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చారు.. ఆ తర్వాత కావాలనే పుంగనూరులోకి వెళ్ళాలని ప్రయత్నించారని పేర్కొన్నారు.  ఆ తర్వాత వారు పోలీసులపై విచక్షణంగా దాడి చేశారని తెలిపారు. కచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పోలీసులకు, ప్రభుత్వానికి ఇది ప్రతిష్టాత్మకం అన్నారు. షార్ట్ గన్స్ కు లైసెన్స్ ఉండదు కానీ, వారు ఆయుధాలు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. 200 వాహనాల్లో రౌడీలను తెచ్చుకున్నారని ఆరోపించారు. కుప్పం అనగానే చంద్రబాబుకు ఓటమి, పెద్దిరెడ్డి గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. అందుకే ఈ దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.