Chandrababu : పవన్ కల్యాణ్‌కు స్పెషల్ థ్యాంక్స్ : చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదల అయ్యారు.

Chandrababu special thanks to Pawan Kalyan
Chandrababu comments : తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదల అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజుల పాటు ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.
పవన్ కళ్యాణ్‌కు స్పెషల్ థ్యాంక్స్..
జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనపై పార్టీ శ్రేణులు, అభిమానులు చూపించిన ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. తాను ఏనాడు తప్పు చేయలేదని, ఎవరినీ చేయనివ్వలేదన్నారు. తనకు మద్దతుగా నిలిచిన తెలుగు వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
తన అరెస్ట్‌ను ఖండిస్తూ సంపూర్ణ మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), భారత రాష్ట్ర సమితి (భారాస), సీపీఐ, కొందరు కాంగ్రెస్ నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. జనసేన ఓపెన్‌గా వచ్చి పూర్తిగా సహకరించిందన్నారు. పవన్ కల్యాణ్‌కు మనస్ఫూర్తిగా అభినందలు తెలియజేశారు.
చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి..
చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. చంద్రబాబుకు బెయిల్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు. ఆయన అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరం అని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read: జైలు నుంచి బయటకు రాగానే తాత చంద్రబాబును హత్తుకున్న దేవాన్ష్
శ్రీ @ncbn గారికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/Hd1xjBsOCS
— JanaSena Party (@JanaSenaParty) October 31, 2023